• Home » Employees

Employees

86 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల పదవీకాలం పొడిగింపు

86 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల పదవీకాలం పొడిగింపు

రాష్ట్రంలోని 86 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఆర్నెల్లు పొడిగించింది. ఇందులో 11 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు/ నగర పంచాయతీలున్నాయి.

డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఎంపికైతే..

డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఎంపికైతే..

ఆర్‌ఎస్ఐ, ఏఆర్‌పీసీగా సేవలు అందించి, డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా సివిల్‌ ఎస్సైలు, కానిస్టేబుళ్లుగా నియమితులైన వారి పాత సర్వీసును సీనియారిటీ, ఇతర ప్రయోజనాల కోసం పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది.

యువతకు విదేశాల్లో జాబ్స్.. కేంద్రం 'గ్లోబల్ స్కిల్డ్ జాబ్ మ్యాపింగ్'!

యువతకు విదేశాల్లో జాబ్స్.. కేంద్రం 'గ్లోబల్ స్కిల్డ్ జాబ్ మ్యాపింగ్'!

భారతీయ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలను మరింత పెంచేందుకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ కీలక అడుగు వేసింది. సుమారు 20 దేశాల ఉద్యోగ ప్రమాణాలకు అనుగుణంగా భారత యువతను తీర్చిదిద్దనుంది.

ఉద్యోగ సంఘాలతో చర్చలు సఫలం.. రెండు డీఏలకు సర్కార్ ఓకే

ఉద్యోగ సంఘాలతో చర్చలు సఫలం.. రెండు డీఏలకు సర్కార్ ఓకే

ఉద్యోగ సంఘాలతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రెండు డీఏలు ఇచ్చేందుకు సర్కార్ అంగీకరించింది.

51 వేల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 20వ రోజ్‌గార్ మేళాలో ప్రధాని మోదీ సందేశం

51 వేల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 20వ రోజ్‌గార్ మేళాలో ప్రధాని మోదీ సందేశం

దేశవ్యాప్తంగా నిర్వహించిన 20వ 'రోజ్‌గార్ మేళా'లో 51వేల మందికి పైగా యువతకు కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వర్చువల్‌గా ప్రసంగించిన ప్రధాని మోదీ.. దేశాన్ని 'వికసిత్ భారత్'గా మార్చడంలో యువతదే కీలక పాత్రన్నారు.

వచ్చిన రోజే ఫైళ్లు క్లియర్‌ చేయాలి

వచ్చిన రోజే ఫైళ్లు క్లియర్‌ చేయాలి

మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతుల వద్దకు వచ్చిన ఫైళ్లన్నీ అదే రోజున క్లియర్‌ కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు వరుసగా మూడో ఏడాది కూడా ప్రథమ స్థానంలో నిలిచారని ప్రశంసించారు.

ఉద్యోగులకు డీఏ బొనాంజా!

ఉద్యోగులకు డీఏ బొనాంజా!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రెండు కరువు భత్యాల(డీఏ)ను చెల్లించేందుకు వీలుగా జీవోలు జారీ చేసింది. బకాయిలను నాలుగు విడతల్లో చెల్లించనున్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు సంబంధించిన కరువు ఉపశమనం(డీఆర్‌) విడుదల చేయనున్నారు.

మెడికల్ బిల్లు నుంచి పెళ్లి, చదువు వరకు.. పీఎఫ్ అడ్వాన్స్‌ను ఎన్నిసార్లు తీసుకోవచ్చంటే..

మెడికల్ బిల్లు నుంచి పెళ్లి, చదువు వరకు.. పీఎఫ్ అడ్వాన్స్‌ను ఎన్నిసార్లు తీసుకోవచ్చంటే..

ఉద్యోగుల భవిష్యనిధి డబ్బు సాధారణంగా రిటైర్‌మెంట్‌ కోసం దాచుకునేదే. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఆ మొత్తంలో కొంత భాగాన్ని ముందుగానే తీసుకునే అవకాశం ఉంది. తాజాగా ఈపీఎఫ్‌ఓ విత్‌డ్రా నిబంధనలను మరింత సులభతరం చేసింది.

స్వర్ణ వార్డు/స్వర్ణ పంచాయతీ ఉద్యోగుల నిరనస

స్వర్ణ వార్డు/స్వర్ణ పంచాయతీ ఉద్యోగుల నిరనస

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ స్వర్ణ వార్డు/స్వర్ణ పంచాయతీల ఉద్యోగులు కదం తొక్కారు. గత మూడు రోజులుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షల ముగింపు సందర్భంగా ఆదివారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

90 శాతం సమస్యలపై సీఎం హామీ

90 శాతం సమస్యలపై సీఎం హామీ

సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకొచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని, ప్రత్యేకంగా సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఏపీ జేఏసీ చైర్మన్‌ అలపర్తి విద్యాసాగర్‌ అన్నారు. విజయవాడలోని ఎన్జీజీవో హోమ్‌లో ఆదివారం ఆయన మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి