• Home » Employees

Employees

Hyderabad: నేడు ఈఎన్‌సీ(ఓఅండ్‌ఎం) పదవీ విరమణ..

Hyderabad: నేడు ఈఎన్‌సీ(ఓఅండ్‌ఎం) పదవీ విరమణ..

నీటిపారుదలశాఖలో శుక్రవారం కీలక అధికారులు పదవీ విరమణ చేయనున్నారు. ఈఎన్‌సీ(ఓ అండ్‌ఎం, క్వాలిటీ కంట్రోల్‌)గా పని చేస్తున్న భూపతిరాజు నాగేంద్రరావుతోపాటు ఎస్‌ఈలు టి.వెంకటేశ్వరరావు, ఎ.మురళీధర్‌, ఎస్‌.మురళీకృష్ణ, ఈఈలు జి.శ్రీనివాస్‌, కె.రాములు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు(డీఈఈలు) చెన్నం రవీంద్రారెడ్డి, మేళ్లచెరువు వెంకట రామశర్మ రిటైర్‌ కానున్నారు.

Nalgonda: ముగ్గురు తహసీల్దార్లు అరెస్టు!

Nalgonda: ముగ్గురు తహసీల్దార్లు అరెస్టు!

అసైన్డ్‌ భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారని నల్లగొండ జిల్లా నిడమనూరులో పనిచేసిన ముగ్గురు తహసీల్దార్లు, ఓ వీఆర్‌వోను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిడమనూరు మండలం తుమ్మడం శివారులోని 9 ఎకరాల ప్రభుత్వ భూములను అసైన్‌మెంట్‌ కమిటీ తీర్మానం లేకుండానే గతంలో పలువురికి పట్టాలు చేశారు.

Hyderabad: పాలనా యంత్రాంగం ప్రక్షాళన!

Hyderabad: పాలనా యంత్రాంగం ప్రక్షాళన!

రాష్ట్రంలో పెద్దసంఖ్యలో అధికారులు, ఉద్యోగులను బదిలీ చేయాలనుకుంటున్న ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. ఒక్కో శాఖ అంతర్గతంగా ఉత్తర్వులు జారీ చేస్తూ పూర్తి వివరాలు తెప్పించుకుంటున్నాయి. జూన్‌ 4వ తేదీలోపు సమాచారం పంపాలని కోరుతున్నాయి. ఈ తేదీ నాటికి అంతా సిద్ధం చేసి, ప్రభుత్వం ఎదుట ఉంచనున్నాయి.

Contaminated Water: కలుషిత నీటి ఘటనలో అధికారులపై చర్యలు

Contaminated Water: కలుషిత నీటి ఘటనలో అధికారులపై చర్యలు

విజయవాడ: నగరంలో కలుషిత నీరు సరఫరా ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటుపడింది. ఆరుగురు వీఎంసీ అధికారులను సస్పెండ్ చేయగా మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మొగల్‌రాజపురంలో కలుషిత నీరు తాగి వ్యక్తి మృతి చెందగా.. తీవ్ర అస్వస్థతకు గురైన 24 మందికి చికిత్స కొనసాగుతోంది.

Hyderabad: ఉగ్రవాదులకు మీ ఖాతాలోంచి డబ్బులు వెళ్లాయి..

Hyderabad: ఉగ్రవాదులకు మీ ఖాతాలోంచి డబ్బులు వెళ్లాయి..

క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులమంటూ అర్ధరాత్రి వాట్సాప్‌ కాల్‌ చేసిన సైబర్‌ కేటుగాళ్లు.. మీ ఖాతా నుంచి ఉగ్రవాదులకు డబ్బులు వెళ్లాయని భయపెట్టి ఓ వృద్ధుడి నంచి రూ.2లక్షలు కాజేశారు. పోలీసుల వివరాల ప్రకారం... ఆ సైబర్‌ కేటుగాళ్లు, రిటైర్డ్‌ ఉద్యోగికి వాట్సాప్‌ వీడియో కాల్‌ చేశారు. ఆయన లిఫ్ట్‌ చేయగానే ఆవలివైపు పోలీసు యూనిఫామ్‌లో ఓ దుండగుడు కనిపించాడు.

Hyderabad: నేచర్‌ క్యాంపులతో ఒత్తిడి దూరం...

Hyderabad: నేచర్‌ క్యాంపులతో ఒత్తిడి దూరం...

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగ, కుటుంబ బాధ్యతల నిర్వహణతో తీవ్ర ఒత్తిడికి గురవుతూ ప్రకృతిని ఆస్వాధించడం మరిచిపోతున్నాం. అలాంటి వారు నేచర్‌ క్యాంపులతో ఒత్తిడిని దూరం చేసుకోవచ్చంటోంది తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ.

TG News: పాత ఫైళ్లతో డబ్బులు డ్రా చేసిందెవరు?

TG News: పాత ఫైళ్లతో డబ్బులు డ్రా చేసిందెవరు?

గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ పేషీలో ఓ ఉద్యోగి పాత ఫైళ్ల (ఎంబీ బుక్కు)పై బదిలీపై వెళ్లిన కమిషనర్‌ సంతకాలతో డబ్బులు డ్రా చేసిన వైనంపై ఇంటెలిజెన్స్‌ పోలీసులు దృష్టి సారించారు. ఈ తతంగంపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ‘పాత ఫైళ్లపై బిల్లులు’ అనే కథనం ప్రచురించింది. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న ఇంటెలిజెన్స్‌ అధికారులు నాలుగురోజులుగా కూపీ లాగుతున్నారు.

CM Revanth Reddy: 5 నుంచి భారీగా బదిలీలు!

CM Revanth Reddy: 5 నుంచి భారీగా బదిలీలు!

ఎన్నికలు పూర్తవ్వడంతో ఇప్పుడు పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టి సారించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రభుత్వ శాఖల్లో సుదీర్ఘకాలంగా ఒకేచోట పాతుకుపోయిన వారికి స్థానచలనం కలిగించనున్నారా? ఆ స్థానాల్లో సమర్థులైన అధికారులను నియమిస్తారా? ఇందుకోసం పాలనాయంత్రాంగంలో తహసీల్దార్‌ మొదలు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి దాకా అన్ని స్థాయుల్లో భారీ బదిలీలకు కసరత్తు జరుగుతోందా?

CM Revanth Reddy: ఉద్యమ నేతలందరికీ వేడుకల్లో భాగస్వామ్యం

CM Revanth Reddy: ఉద్యమ నేతలందరికీ వేడుకల్లో భాగస్వామ్యం

ఏ ఒక్కరి వల్లనో కాకుండా సమష్టి కృషితోనే రాష్ట్రం సిద్దించిందనే విషయాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాన్ని నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ఏర్పాటులో తమ వంతు పాత్ర పోషించిన వారందరికీ ఉత్సవాల్లో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు.

Hyderabad: పారిశ్రామిక ప్రగతి  కొత్తపుంతలు తొక్కేలా..

Hyderabad: పారిశ్రామిక ప్రగతి కొత్తపుంతలు తొక్కేలా..

సకాలంలో ప్రొత్సాహకాలను అందించి పారిశ్రామిక ప్రగతిని కొత్తపుంతలు తొక్కించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు, ఇప్పటికే పరిశ్రమలను నిర్వహిస్తున్న వారికి సకాలంలో ప్రొత్సాహకాలు అందించేలా విధానాల రూపకల్పనకు ప్రభుత్వం సిద్ధమైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి