Home » Employees
Andhrapradesh: ఏపీ నుంచి తమను రిలీవ్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగులు వినతి చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో 712 మంది స్థానికత ఉన్న ఉద్యోగులు పని చేస్తున్నారు. సచివాలయం, హెచ్వోడీలు, 9,10వ షెడ్యూల్ సంస్థల్లో పని చేస్తున్న 224 మంది రాష్ట్ర కేడర్ ఉద్యోగులను కూడా రిలీవ్ చేయాలని ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు.
Andhrapradesh: ఏపీలో ఊరూవాడా పెన్షన్ల పంపిణీతో ఓవైపు పండగ వాతావరణం నెలకొంటే.. మరోవైపు పెన్షన్ల విషయంలో ఓ సచివాలయ ఉద్యోగి చేసిన నిర్వాకంతో అంతా అవాక్కవ్వాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేటి నుంచి పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు.
సైబర్ నేరగాళ్ల వలలో పడ్డ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రూ. 18లక్షలు పోగొట్టుకున్నాడు. వెంటనే తాను మోసపోయానని తెలుసుకొని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పి తనకు సాయం చేయాలని విన్నవించాడు.
అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులతో సమావేశం అయ్యారు. ఉద్యోగుల సమస్యలు ఆసాంతం వింటూ... వాటిని నోట్ చేసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసుకు హాజరయ్యే విషయంలో సమయపాలనను ఖచ్చితంగా పాటించాల్సిందే. టైమంటే టైముకు రావాల్సిందే.
అమెరికా, చైనా దేశాల్లో ఉద్యోగం చేసిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో వ్యాపారం చేసి నష్టపోయి ర్యాపిడో డ్రైవర్‌గా మారాడు. ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు చివరికి దొంగగా మారాడు. ఓ నగల దుకాణంలో దోపీడీకి యత్నించి పోలీసులకు చిక్కాడు.
నిత్యం ఆలస్యంగా ఆఫీసుకు వెళ్లే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు(Central Govt Employees) సర్కార్ షాక్ ఇచ్చింది. కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (DoPT) సీనియర్ అధికారులతో సహా ఉద్యోగులందరూ తప్పనిసరిగా 9.15లోపే బయోమెట్రిక్ అటెండెన్స్(Biometric Attendence) వేయాలని స్పష్టం చేసింది.
ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ ఇటీవల నితీశ్ కుమార్ నేతృత్వంలోని బిహార్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టేసింది.
రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. అందులో భాగంగా మల్టీజోన్-1లోని 19 జిల్లాల పరిధిలోని 10 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తూ అఽధికారులు బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ఇంకా కొత్త నిర్ణయాలేమీ తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఏపీ నుంచి తెలంగాణకు ఉద్యోగులు వస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరాయి.