Home » Eluru
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలోని వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు ఆదివారం రాత్రి సందర్శించారు.
Andhrapradesh: కరువు రహిత రాష్ట్రంగా చేయాలన్న ఉద్దేశంతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం ఉదయం తాళ్ళపూడి మండలం తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని విడుదల మంత్రి విడుదల చేశారు.
జంగారెడ్డిగూడెం(Jangareddygudem) మండలం దేవులపల్లి (Devulapalli) మాజీ సర్పంచ్ దోరేపల్లి లక్ష్మీనారాయణ ఇంట్లో భారీ చోరీ(Robbery) జరిగింది. ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి రూ.3.70లక్షలు సహా 8తులాల బంగారు ఆభరణాలు, 4కేజీల వెండి దొంగిలించారు.
ఎలూరు జిల్లా: పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం ఆదివారం పరిశీలించనుంది. నాలుగు రోజులపాటు పోలవరంలోనే పర్యటించనుంది. ప్రాజెక్టు ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు, డయాఫ్రం వాల్ ప్రాంతాలను నిపుణులు పరిశీలిస్తారు. ప్రాజెక్టు ఇంజనీర్లు, క్రాంటాక్టు ఏజెన్సీలతో సమీక్షను నిర్వహిస్తారు.
కేరళకు ఆనుకుని అరేబియా సముద్రంతో పాటు బంగాళాఖాతం, కోస్తాంధ్రల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. అలాగే అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో తేమ మేఘాలు ఆవరించడంతో రుతుపవనాలకు అనుకూలమైన వాతావరణం కొనసాగుతోంది.
డిగ్రీ చేసి.. పని, పాటా లేని యువకుడు తన క్లాస్ మేట్ అయిన యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుందామని ఆ యువతితో చెబితే తిరస్కరించింది. ఆ విషయం మనసులో పెట్టుకున్న యువకుడు యువతిని దారుణంగా హతమార్చాడు. తర్వాత ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
ఏలూరు జిల్లా: జంగారెడ్డి గూడెం, పర్రెడ్డి గూడెం విద్యుత్ సబ్ స్టేషన్‌లో పని చేస్తున్న షిఫ్ట్ ఆపరేటర్ రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. విధులలో నిర్లక్ష్యం వహిస్తూ సబ్ స్టేషన్‌లో ఓ మహిళతో అసభ్యకరరీతిలో షిఫ్ట్ ఆపరేటర్ మహేశ్వర రెడ్డి నిద్రిస్తున్న దృశ్యాన్ని స్థానికులు గమనించారు.
ఏలూరు జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు బుధవారం చిన వెంకన్న స్వామి మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
కేడర్ అంచనాలు కాస్తంగా ఎక్కువగా కనిపిస్తున్నా అభ్యర్థులు మాత్రం సొంతంగా వేసే అంచనాలు. లెక్కలు అన్నీ ఇప్పటి వరకు ఇంకా పక్కాగా తేలలేదు. గెలుపు, ఓటమిలను పక్కనపెట్టి మెజారిటీ ఎంతనేదే అభ్యర్థుల అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. ఆ దిశగానే పోలింగ్ ముగిసి వారం గడుస్తున్నా ఇంకా పక్కాగా లెక్క తేలలేదు. కేవలం తాము వేసుకున్న అంచనాల ప్రకారం ఆయా ప్రాంతాల్లో సానుకూలత, వచ్చే మెజార్టీ మాత్రమే లెక్కించగలిగారు. కొంత మంది ముఖం చాటేసి ఏ రూపంలో నష్టపరిచింది కూడా లెక్క కట్టేశారు..
ఏలూరు జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నాల్గవ రోజు మంగళవారం స్వామివారు రామ లక్ష్మణ సమేత హనుమాన్ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.