Home » Elephant
Andhrapradesh: తిరుపతిలో ఏనుగుల బీభత్సం అంతా ఇంతా కాదు. గజరాజుల విజృంభన రైతులకు ఆవేదనను మిగిల్చింది. గత రోజులుగా ఏనుగుల హల్‌చల్‌తో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. రేణిగుంట మండలం చైతన్యపురం గ్రామంలో ఏకంగా 15 ఏనుగుల సంచారంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏనుగుల బీభత్సంతో పంట పొలాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో మామిడి పంటపై ఆధారపడ్డ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఏనుగు జాడ కోసం అటవీ శాఖ గాలింపు నిర్వహిస్తోంది. సులుగు పల్లి - ముంజం పల్లి మధ్యలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రాణహిత ప్రాజెక్టు కాల్వ గుండా ఏనుగు ప్రయాణం సాగుతోందని తెలుసుకున్నారు. బెజ్జురు, చింతల మానే పల్లి, పెంచికల్ పేట, దహెగాం మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
కొమురంభీం: జిల్లాలో ఏనుగు అలజడి సృష్టించింది. చింతల మానేపల్లి మండలం, బూరెపల్లి శివారులో ఏనుగు దాడిలో రైతు మృతి చెందాడు. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి కొమురంభీం జిల్లాలోకి ఏనుగు ప్రవేశించింది.
జంతువులకు ఆకలి వేసిన సందర్భాల్లో సాధారణంగా వేటాడడమో, లేక అందుబాటులో ఉన్న ఆహారంతో ఆకలి తీర్చుకోవడమో చేస్తుంటాయి. అయితే కొన్నిసార్లు వాటికీ ఆకలితిప్పలు ఎదురవుతుంటాయి. అలాంటి సందర్భాల్లో ఆకలి తీర్చుకునేందుకు కొన్నిసార్లు అవి బీభత్సం సృష్టిస్తుంటాయి. ఇలాంటి..
చిత్తూరులో ఓ ఏనుగు హల్ చల్ చేస్తోంది. ఆదివారం ఉదయాన్నే ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి.. వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పలమనేరు ఆంజనేయ స్వామి గుడి వద్దకు ఓ ఏనుగు వచ్చింది.
జనారణ్యంలో జంతువులు బీభత్సం సృష్టించడం చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు ఇలాంటి సంఘటనలు చివరకు విషాదాంతం అవుతుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఏనుగులకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ఇబ్బందులు పాలైన ఓ అడవి ఏనుగు ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంతో ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద హర్షం వ్యక్తం చేశారు.
ఏనుగులు చూసేందుకు ఎంతో ప్రశాంతంగా కనిపించినా.. కొన్నిసార్లు అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటాయి. అప్పటిదాకా సైలెంట్‌గా ఉండే ఏనుగులు.. ఉన్నట్టుండి ఉగ్రరూపం దాల్చుతుంటాయి. వాహనాలను ఎత్తి పడేయడం, మేత వేయడానికి వచ్చిన యువతులపై దాడులు చేయడం వంటివి చేయడం...
టూరిస్టులపై అకస్మాత్తుగా దాడి చేసిన ఏనుగు, నెట్టింట్లో కలకలం రేపుతున్న వైరల్ వీడియో
Viral Video: సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియోలకు(Videos) కొదవే లేదు. ఏదైనా సోషల్ మీడియా(Social Media) యాప్ ఓపెన్ చేస్తే చాలు వీడియోలు వరుసగా వచ్చేస్తాయి. వీటిలో కొన్ని వీడియో మనసును హత్తుకుంటే.. మరికొన్ని లైట్ తీసుకుంటాం. ఇంకొన్ని వీడియోలను పదే పదే చూడాలనిపిస్తుంది. ఎందుకంటే వాటిలో ఉండే కంటెంట్, సీన్స్ అలా ఉంటాయి మరి.