Home » Election Commission
గ్రామపంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్నదానిపై స్పష్టత లేనప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ఓటరు జాబితా రూపకల్పనపై దృష్టి సారించింది.
Andhrapradesh: ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలపై ఈరోజు (సోమవారం) నుంచి అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు మాక్ పోలింగ్ జరుగనుంది. రోజుకు మూడు ఈవీఎంలు చొప్పున అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఒంగోలులో మొత్తం 12 పోలింగ్ కేంద్రాల్లో అనగా... 6,26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను ఈసీ అధికారులు పరిశీలించనున్నారు.
రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. జమ్ముకశ్మీర్‌లో మూడు దశల్లో (సెప్టెంబరు 18, 25, అక్టోబరు 1).. హరియాణాలో అక్టోబరు 1న శాసనసభ ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం వెల్లడించింది.
పోలింగ్ శాతాల్లో భారీగా తేడాలు ఉన్నాయంటూ వస్తున్న విశ్లేషణలను ఆదివారం ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన వెంటనే ప్రకటించిన ఓట్ల శాతానికి, తుది ఓట్ల శాతానికి మధ్య మరీ ఎక్కువగా తేడా ఉందంటూ విశ్లేషణలు వచ్చాయి.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నాహకాలను సమీక్షించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకూ జమ్మూకశ్మీర్‌లో పర్యటించనుంది.
ఎవరైనా రెండు ప్రాంతాల్లో ఓట్లు కలిగి ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) రాజీవ్ కుమార్ హెచ్చరించారు. 2024 పార్లమెంట్,అసెంబ్లీ ఎన్నికలకు సంబందించిన మొదటి సమావేశాన్ని విజయవాడలో నిర్వహించారు.
టీడీపీ, జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మంగళవారం దాఖలు చేసిన సి.రామచంద్రయ్య (Ramachandraiah), పి.హరిప్రసాద్ (Hariprasad,) నామినేషన్లను ఎన్నికల సంఘం(Election Commission) ఆమోదించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నిక(MLC by-elections)కు జారీ చేసిన నోటిఫికేషన్‌కు ఇప్పటివరకూ రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే వారికి శిక్ష తప్పదని, మాచర్ల మాజీ శాసన సభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదంతమే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించింది.
హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలను మొదలు పెట్టామని ఎన్నికల సంఘం ప్రకటించింది.
దేశవ్యాప్తంగా 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని 92 పోలింగ్ కేంద్రాలు, 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 26 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల వెరిఫికేషన్ కోసం దరఖాస్తులు వచ్చాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది