Home » Election Campaign
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ పనైపోయిందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. శనివారం కళ్యాణదుర్గం మండలం పాపంపల్లి, మోరేపల్లి, కొత్తూరు, కుర్లపల్లి, గరుడాపురం గ్రామాల్లో అశేష జనవాహిని మధ్య రోడ్డుషో నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలు అమిలినేనికి పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Election 2024) మే 13న పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల కమిషన్ (Election Commission) శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం ఈరోజు(శనివారం) సాయంత్రం 6 గంటలకే ముగిసింది. ప్రచారం ముగిసిన కూడా ఓటర్లకు పలు రాజకీయ పార్టీల నుంచి బల్క్ ఎస్ఎంఎస్‍లు వస్తునే ఉన్నాయి. వీటిపై ఈసీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో మే13న పార్లమెంట్ ఎన్నికలకు (Lok Sabha Election 2024) పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సంఘం (Election Commission) 144 సెక్షన్ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మందు బాబులకు కూడా ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. 48 గంటల పాటు మద్యం షాపులు మూసివేయాలని ఈసీ ఆదేశించింది.
పార్లమెంట్ ఎన్నికల (Lok Sabha Election 2024) కోసం కట్టదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశామని తెలంగాణ డీజీపీ రవిగుప్తా (DGP Ravi Gupta) తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడానికి పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను చేశామని చెప్పారు. శనివారం డీజీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
కడప: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు, ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల శనివారం కడపలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Telangana: రాజ్యాంగాన్ని మార్చాలని ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం పటాన్‌చెరు చేరుకున్న సీఎం.. కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. మతాల మధ్య మనుషుల మధ్య గొడవలు పెట్టాలని బీజేపీ చూస్తోందన్నారు. తెలంగాణకు ప్రధాని నరేంద్రమోదీ వచ్చినప్పుడు రాష్ట్రానికి ఏమైనా ఇస్తారేమో అని చూసామని... కానీ ఏమీ ఇవ్వలేదని విమర్శించారు. హిందూ, ముస్లింలు కొట్టుకొని చావాలని..
చిత్తూరు జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం తిరుపతికి రానున్నారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం ఆయన తిరుపతిలో రోడ్డు షో నిర్వహించనున్నారు. జ్యోతిరావు పులే విగ్రహం వద్ద నుంచి నాలుగకాళ్ళ మండపం వరకు రోడ్డు షో సాగనుంది.
రంగారెడ్డి జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాండూర్, కామారెడ్డిలలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు పఠాన్‌చెరు కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు.
చంద్రబాబునాయుడును మరోసారి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని టీడీపీ రాయలసీమ జోనల్ ఇనచార్జి వైకుంఠం ప్రభాకర్‌చౌదరి అన్నారు.
ఎన్నికల ఫలితాల్లో తాడిపత్రిలో ఎగిరేది పసుపు జెండానే, గెలిచేది జేసీ అశ్మితరెడ్డే అని, వచ్చే ఐదేళ్లల్లో అభివృద్ధి అంటే ఏమిటో నా బిడ్డ చేసి చూపిస్తాడని మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. పట్టణంలోని సీబీరోడ్డు, అశోక్‌పిల్లర్, మెయినబజారు, నవరంగ్ టాకీ్‌సరోడ్డు, పోలీ్‌సస్టేషనరోడ్డు మీదుగా ర్యాలీ సాగింది.