• Home » Election Campaign

Election Campaign

BALAYYA : సొంత చెల్లెలికి న్యాయం చేయలేని జగన

BALAYYA : సొంత చెల్లెలికి న్యాయం చేయలేని జగన

సొంత చెల్లి, తల్లికి న్యా యం చేయలేని దుర్మార్ఘుడు జగన అని, అలాంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రచార ము గింపు సందర్భంగా ఆయన శనివారం హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి నియోజకవర్గ వ్యా ప్తంగా వేల మంది తరలివచ్చారు. నంది సర్కిల్‌ నుంచి అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ సాగింది. అక్కడ బాల కృష్ణ మాట్లాడుతూ... అన్న అన్యాయం చేశాడు... తాము మోసపోయామంటూ సొంత చెల్లులు ఆరోపిస్తుంటే ఈ ముఖ్యమంత్రికి చెవికెక్కలేదన్నారు.

KALAVA CAMPAIN: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభంజనం

KALAVA CAMPAIN: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభంజనం

రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం కనిపిస్తోందని, ప్రజలు స్పష్టమైన మార్పు కోరుకుంటున్నారని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థితిని, గతిని మార్చే ఎన్నికలు 13వ తేదీన జరగబోతున్నాయన్నారు. ఐదేళ్ల జగనమోహనరెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడటానికి సిద్ధమైన ప్రజలు చేసే యుద్ధం ఎల్లుండి చూడబోతున్నామన్నారు.

GUMMANURU: రానున్నది టీడీపీ ప్రభుత్వమే

GUMMANURU: రానున్నది టీడీపీ ప్రభుత్వమే

ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏర్పడేది టీడీపీ ప్రభుత్వమని, అది తెలిసే వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు ముమ్మరమయ్యాయని ఎమ్మెల్యే అభ్యర్థి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి అన్నారు.

AMILINENI : కళ్యాణదుర్గంలో వైసీపీ పనైపోయింది

AMILINENI : కళ్యాణదుర్గంలో వైసీపీ పనైపోయింది

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ పనైపోయిందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. శనివారం కళ్యాణదుర్గం మండలం పాపంపల్లి, మోరేపల్లి, కొత్తూరు, కుర్లపల్లి, గరుడాపురం గ్రామాల్లో అశేష జనవాహిని మధ్య రోడ్డుషో నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలు అమిలినేనికి పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు.

AP Election 2024 : ఎన్నికల ప్రచారం ముగిసిన బల్క్ ఎస్ఎంఎస్‍లు.. ఎన్నికల సంఘం నిఘా

AP Election 2024 : ఎన్నికల ప్రచారం ముగిసిన బల్క్ ఎస్ఎంఎస్‍లు.. ఎన్నికల సంఘం నిఘా

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Election 2024) మే 13న పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల కమిషన్ (Election Commission) శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం ఈరోజు(శనివారం) సాయంత్రం 6 గంటలకే ముగిసింది. ప్రచారం ముగిసిన కూడా ఓటర్లకు పలు రాజకీయ పార్టీల నుంచి బల్క్ ఎస్ఎంఎస్‍లు వస్తునే ఉన్నాయి. వీటిపై ఈసీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Lok Sabha Election 2024: మందుబాబులకు బిగ్ అలర్ట్.. ఆందోళనలో మద్యం ప్రియులు

Lok Sabha Election 2024: మందుబాబులకు బిగ్ అలర్ట్.. ఆందోళనలో మద్యం ప్రియులు

తెలంగాణలో మే13న పార్లమెంట్ ఎన్నికలకు (Lok Sabha Election 2024) పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సంఘం (Election Commission) 144 సెక్షన్ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మందు బాబులకు కూడా ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. 48 గంటల పాటు మద్యం షాపులు మూసివేయాలని ఈసీ ఆదేశించింది.

Lok Sabha Election 2024:పార్లమెంట్ ఎన్నికల కోసం కట్టదిట్టమైన భద్రతా చర్యలు: డీజీపీ రవి గుప్తా

Lok Sabha Election 2024:పార్లమెంట్ ఎన్నికల కోసం కట్టదిట్టమైన భద్రతా చర్యలు: డీజీపీ రవి గుప్తా

పార్లమెంట్ ఎన్నికల (Lok Sabha Election 2024) కోసం కట్టదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశామని తెలంగాణ డీజీపీ రవిగుప్తా (DGP Ravi Gupta) తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడానికి పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను చేశామని చెప్పారు. శనివారం డీజీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

Congress: రాష్ట్రంలో బీజేపీ బీ టీమ్‌ నడుస్తోంది: రాహుల్‌ గాంధీ

Congress: రాష్ట్రంలో బీజేపీ బీ టీమ్‌ నడుస్తోంది: రాహుల్‌ గాంధీ

కడప: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు, ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల శనివారం కడపలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

Loksabha Polls: హిందూ, ముస్లింలు కొట్టుకుని చావాలని బీజేపీ చూస్తోంది.. రేవంత్ ఫైర్

Loksabha Polls: హిందూ, ముస్లింలు కొట్టుకుని చావాలని బీజేపీ చూస్తోంది.. రేవంత్ ఫైర్

Telangana: రాజ్యాంగాన్ని మార్చాలని ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం పటాన్‌చెరు చేరుకున్న సీఎం.. కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. మతాల మధ్య మనుషుల మధ్య గొడవలు పెట్టాలని బీజేపీ చూస్తోందన్నారు. తెలంగాణకు ప్రధాని నరేంద్రమోదీ వచ్చినప్పుడు రాష్ట్రానికి ఏమైనా ఇస్తారేమో అని చూసామని... కానీ ఏమీ ఇవ్వలేదని విమర్శించారు. హిందూ, ముస్లింలు కొట్టుకొని చావాలని..

JP Nadda: తిరుపతికి రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

JP Nadda: తిరుపతికి రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

చిత్తూరు జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం తిరుపతికి రానున్నారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం ఆయన తిరుపతిలో రోడ్డు షో నిర్వహించనున్నారు. జ్యోతిరావు పులే విగ్రహం వద్ద నుంచి నాలుగకాళ్ళ మండపం వరకు రోడ్డు షో సాగనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి