Home » Election Campaign
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్‌కు పట్టుమని 10 రోజులు కూడా సమయం లేదు. గెలుపు కోసం రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్లి ప్రచారాన్ని హోరెతిస్తున్నాయి. హాట్ హాట్‌గా జరుగుతున్న ఈ పరిస్థితుల్లో కూటమి తరపున ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో ఎన్నికల ప్రచారానికి విచ్చేస్తున్నారు.
Telangana: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు మరో వారం రోజుల సమయమే ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రచార జోరును మరింత పెంచింది. కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణకు రానున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రెండు సార్లు రాష్ట్రంలో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించేలా కాంగ్రెస్ శ్రేణులు షెడ్యూల్‌ను రూపొందించింది.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఎన్నికల సభలో అపశృతి చోటు చేసుకుంది. శనివారం జిల్లాలోని పలమనేరులో సీఎం జగన్ సభ నిర్వహించారు. అయితే జగన్ సభకు హాజరైన ప్రజల్లో పలువురు అస్వస్థతకు గురయ్యారు. సభకు వచ్చిన జనానికి వైసీపీ శ్రేణులు చల్లని పానీయాలు పంపిణీ చేశారు. అయితే వీటిని తాగిన పలువురకి అనారోగ్యం పాలయ్యారు. వాంతులు అవడంతో వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Andhrapradesh: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి పార్టీల బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం వాకర్స్‌తో, ముఠా కార్మికులతో సుజనా భేటీ అయ్యారు. ముఠా కార్మికుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. వారిని ఆర్ధికంగా బలోపేతం చేసేలా, ఉపాధికి మార్గాలు చూపే బాధ్యత తనది అంటూ భరోసా ఇచ్చారు.
టీడీపీ అధికారంలోకి రాగానే మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి అన్నారు. మండలంలోని చీమలవాగుపల్లి, నరసాపురం, పసలూరు, దేవునిఉప్పలపాడు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు.
ముస్లింలు టీడీపీకి వెన్నంటి నిలిచి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేయాలని ఉమ్మడి అభ్యర్థి గుమ్మనూరు జయరాం కోరారు. పట్టణంలోని ఈద్గా మైదానం వద్ద ఉన్న మసీదులో శుక్రవారం నమాజు అనంతరం ముస్లింలను కలసి తనకు ఓటువేసి గెలిపించాలని జయరాం అభ్యర్థించారు.
ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో తన గెలుపు తథ్యమని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. శుక్రవారం రాయదుర్గం పట్టణంలోని 5, 6, 9 వార్డులలో రోడ్‌షో నిర్వహించారు. అదే విధంగా ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు.
టీడీపీతోనే కళ్యాణదుర్గానికి మహర్దశ పట్టనుందని కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. శుక్రవారం శెట్టూరు మండల చింతర్లపల్లి, ముచ్చర్లపల్లి, చౌళూరు, కనుకూరు, మల్లేటిపురం, అనుంపల్లి, రంగయ్య పాల్యం, ములకలేడు గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో సురేంద్రబాబు మాట్లాడుతూ రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గ్రామీణ రోడ్ల రూపురేఖలు మారుతాయన్నారు.
రాష్ట్రంలో వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ విమర్శించారు. మండలంలోని రాకెట్ల, ఆమిద్యాల, మోపిడి, ఇంద్రావతి, పెద్దముష్టూరు గ్రామాల్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి స్వగ్రామమైన రాకెట్లలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులతో స్వాగతం పలికారు.
టీపీపీతోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని టీపీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు పేర్కొన్నారు. ఆయన శుక్రవారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామితో కలిసి మండల పరిధిలోని జీవీ పాళ్యం, గోవిందాపురం, కదిరే పల్లి, వైబీ హళ్లి, మెళవాయి పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ నాయకులకు గ్రామా ల్లో అడుగడుగునా మహిళలు, రైతులు, ప్రజలు బహ్మ రథం పట్టారు. ఈ సందర్భంగా గుండుమల తిప్పేస్వా మి మాట్లాడుతూ... ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో వైసీపీ రాక్ష సపాలన సాగిందన్నారు.