Home » Election Campaign
తెలుగుదేశం అధికారంలోకి రాగానే బీసీ వర్గంలోని 50 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ రూ.4 వేలు పింఛన అందిస్తామని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. పట్టణంలోని సీతారామాంజనేయ కళ్యాణమంటపంలో కుర్ని సమాజం కులస్థులతో ఆదివారం ఆత్మీయ కలయిక నిర్వహించారు.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వాల్మీకులను గుర్తించి పదవులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీయేనని స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. పురంలోని జేవీఎస్ ఫంక్షనహాల్‌లో ఆదివారం వాల్మీకుల ఆత్మీయ సమావేశం జరిగింది. నియోజకవ ర్గంలోని వేలమంది వాల్మీకులు తరలివచ్చారు. ఈ సం దర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... వాల్మీకి సామాజిక వర్గానికి పార్టీ పదవుల్లో సింహభాగం కేటాయించామ న్నారు. ఈసారి ఉమ్మడి జిల్లాలో ఎంపీతోపాటు రెండు ఎమ్మెల్యే స్థానాలు కేటాయించామన్నారు.
ఆదిలాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. రెండు చోట్ల బహిరంగ సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు.
తెలుగుదేశం పార్టీతోనే మడకశిర అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు పేర్కొన్నారు. ఆయన శనివారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండు మల తిప్పేస్వామితో కలిసి మండల పరిధిలోని హులికుంట, గుడ్డగుర్కి, దొడ్డేరి పంచాయతీలలో ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. గ్రామాల్లో అడుగడుగునా హారతులు పట్టి, గజమాలలతో సన్మానించారు. ఈసందర్భంగా గుండుమల, ఎంఎస్ రాజు మాట్లాడుతూ... ఈ ఐదేళ్లూ మడకశిరలో వైసీపీ రాక్షసపాలన సాగిందన్నారు.
మండలంలోని పాలసముద్రం ప్రాంతం ప్రపంచ పటంలో గుర్తింపు వచ్చేలా చేసిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుదే అని టీడీపీ కూట మి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. గోరంట్ల మం డలంలోని పాలసముద్రం, వడిగేపల్లి, రెడ్డిచెరువుపల్లి పంచాయతీ గ్రామాల్లో రోడ్‌షో ద్వారా సవిత శనివారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాల సముద్రంలో పెద్దఎత్తున జనం తరలివచ్చి గజమాల లు, హారతులు, పూల వర్షంతో ఆమెకు ఘనస్వాగతం పలికారు.
ఎన్నికల్లో సైకిల్‌గుర్తుకు ఓటువేసి అభివృద్ధికి పట్టం కట్టాలని కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని ఆలూరు, సజ్జలదిన్నె, బుగ్గ, ఇగుడూరు, చుక్కలూరు గ్రామాల్లో శనివారం ఆయన రోడ్‌షో, బహిరంగ సభలు నిర్వహించారు.
న్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణకు రెండు ఓట్లు వేసి గెలిపించాలని గుమ్మనూరు జయరాం ఓటర్లను అభ్యర్థించారు. శనివారం ఉదయం పట్టణంలోని 6, 7, 8, 26 వార్డుల్లో ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు.
రైతుల భూములను కబ్జా చేయడానికి జగన అమలు చేసేందుకు సిద్ధమైన ల్యాండ్ టైటిల్ చట్టాన్ని తెలుగుదేశం అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. గొల్లపల్లి, గలగల, పైదొడ్డి, కేపీదొడ్డి, రంగసముద్రం, తాళ్లకెర, గుమ్మఘట్ట, గోనబావి గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రోడ్‌షో నిర్వహించారు.
కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మొదటిస్థానంలో నిలుపుతామని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. శనివారం మండలంలోని గూబనపల్లి, దొడఘట్ట, కురాకుల పల్లి, ఒంటిమిద్ది, ముదిగల్లు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాలలో అమిలినేనికి పూలవర్షం కురిపించి గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో అవసరమైన మౌలిక వసతులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు.
ఫ్రీ బస్సు పథకం సంతోషమే కానీ.. దాని వల్ల ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన మంచిర్యాల రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..