• Home » Election Campaign

Election Campaign

GUMMANURU: ఆదరించండి.. అండగా ఉంటా: గుమ్మనూరు

GUMMANURU: ఆదరించండి.. అండగా ఉంటా: గుమ్మనూరు

ఎన్నికల్లో తనను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించాలని, ఐదేళ్లూ అండగా ఉంటానని కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం కోరారు. ఆదివారం ఉదయం పాతగుంతకల్లులోని వాల్మీకి సర్కిల్‌ నుంచి పాదయాత్రగా బయలుదేరిన ఆయన ప్రధాన రహదారిలోని ఇళ్లు, వాణిజ్య సముదాయాలలో ప్రచారం చేశారు. అనంతరం మహబూబాబాద్‌లో ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరయ్యారు.

AMILINENI ROAD SHOW: యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం

AMILINENI ROAD SHOW: యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం

పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. ఆదివారం కంబదూరు మండల పాళ్లూరు, కొత్తమిద్దెల, గొల్లపల్లి, పాత ఐపార్స్‌పల్లి, కొత్త ఐపార్స్‌పల్లి, గూళ్యం, కత్రపర్తి, కే కొత్తూరు, డీ చెన్నేపల్లిలో సురేంద్ర బాబు రోడ్‌షో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో అమిలినేనికి గజమాలలతో సన్మానించి స్వాగతం పలికారు.

SAVITA : చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

SAVITA : చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

బడుగు, బలహీనవర్గాల అభివృధ్ది చంద్రబాబుతోనే సాధ్యమని టీడీపీ కూటమి అభ్యర్థి సవిత తెలిపారు. మండలంలోని కొండాపురం, వెంకట రమణపల్లి, పులేరు పంచాయతీల్లో ఆదివారం ఆమె ఎ న్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో పోటీ పడు తూ వివిధ రకాల పండ్లతో, పూలతో తయారు చేసిన గజమాలలు వేసి, హారుతులలో స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడు తూ... టీడీపీ మేనిఫెస్టో పట్ల సంతృప్తి చెందిన ప్రజ లు చూపిస్తున్న ఆదారాభిమానంతో ఇది ఎన్నికల ప్ర చారంలా లేదని విజయోత్సవంలా ఉందన్నారు.

KALAVA CAMPAIN: ప్రతి బీసీకి రూ.4 వేలు పింఛన

KALAVA CAMPAIN: ప్రతి బీసీకి రూ.4 వేలు పింఛన

తెలుగుదేశం అధికారంలోకి రాగానే బీసీ వర్గంలోని 50 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ రూ.4 వేలు పింఛన అందిస్తామని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. పట్టణంలోని సీతారామాంజనేయ కళ్యాణమంటపంలో కుర్ని సమాజం కులస్థులతో ఆదివారం ఆత్మీయ కలయిక నిర్వహించారు.

BALAYYA : వాల్మీకులను గుర్తించింది టీడీపీనే...

BALAYYA : వాల్మీకులను గుర్తించింది టీడీపీనే...

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వాల్మీకులను గుర్తించి పదవులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీయేనని స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. పురంలోని జేవీఎస్‌ ఫంక్షనహాల్‌లో ఆదివారం వాల్మీకుల ఆత్మీయ సమావేశం జరిగింది. నియోజకవ ర్గంలోని వేలమంది వాల్మీకులు తరలివచ్చారు. ఈ సం దర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... వాల్మీకి సామాజిక వర్గానికి పార్టీ పదవుల్లో సింహభాగం కేటాయించామ న్నారు. ఈసారి ఉమ్మడి జిల్లాలో ఎంపీతోపాటు రెండు ఎమ్మెల్యే స్థానాలు కేటాయించామన్నారు.

Rahul Gandhi: నిర్మల్‌ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ గాంధీ....

Rahul Gandhi: నిర్మల్‌ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ గాంధీ....

ఆదిలాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. రెండు చోట్ల బహిరంగ సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు.

MS : టీడీపీతోనే మడకశిర భవిష్యత్తు

MS : టీడీపీతోనే మడకశిర భవిష్యత్తు

తెలుగుదేశం పార్టీతోనే మడకశిర అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌ రాజు పేర్కొన్నారు. ఆయన శనివారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండు మల తిప్పేస్వామితో కలిసి మండల పరిధిలోని హులికుంట, గుడ్డగుర్కి, దొడ్డేరి పంచాయతీలలో ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. గ్రామాల్లో అడుగడుగునా హారతులు పట్టి, గజమాలలతో సన్మానించారు. ఈసందర్భంగా గుండుమల, ఎంఎస్‌ రాజు మాట్లాడుతూ... ఈ ఐదేళ్లూ మడకశిరలో వైసీపీ రాక్షసపాలన సాగిందన్నారు.

SAVITA : చంద్రబాబుతోనే పాలసముద్రం ప్రఖ్యాతి

SAVITA : చంద్రబాబుతోనే పాలసముద్రం ప్రఖ్యాతి

మండలంలోని పాలసముద్రం ప్రాంతం ప్రపంచ పటంలో గుర్తింపు వచ్చేలా చేసిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుదే అని టీడీపీ కూట మి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. గోరంట్ల మం డలంలోని పాలసముద్రం, వడిగేపల్లి, రెడ్డిచెరువుపల్లి పంచాయతీ గ్రామాల్లో రోడ్‌షో ద్వారా సవిత శనివారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాల సముద్రంలో పెద్దఎత్తున జనం తరలివచ్చి గజమాల లు, హారతులు, పూల వర్షంతో ఆమెకు ఘనస్వాగతం పలికారు.

TDP: అభివృద్ధికి పట్టం కట్టండి: అశ్మితరెడ్డి

TDP: అభివృద్ధికి పట్టం కట్టండి: అశ్మితరెడ్డి

ఎన్నికల్లో సైకిల్‌గుర్తుకు ఓటువేసి అభివృద్ధికి పట్టం కట్టాలని కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని ఆలూరు, సజ్జలదిన్నె, బుగ్గ, ఇగుడూరు, చుక్కలూరు గ్రామాల్లో శనివారం ఆయన రోడ్‌షో, బహిరంగ సభలు నిర్వహించారు.

GUMMANURU: రెండు ఓట్లూ కూటమి అభ్యర్థులకు వేయండి

GUMMANURU: రెండు ఓట్లూ కూటమి అభ్యర్థులకు వేయండి

న్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణకు రెండు ఓట్లు వేసి గెలిపించాలని గుమ్మనూరు జయరాం ఓటర్లను అభ్యర్థించారు. శనివారం ఉదయం పట్టణంలోని 6, 7, 8, 26 వార్డుల్లో ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి