Home » Eknath Shinde
లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవికి తనకు అవకాశం వచ్చిందని, పార్టీ ఆర్గనైజేషన్ కోసం పనిచేసే ఆలోచనతో మంత్రి పదవిని నిరాకరించానని శ్రీకాంత్ షిండే తెలిపారు. ప్రభుత్వంలో పొజిషన్ కావాలనే కోరిక తనకు లేదన్నారు.
పార్టీ అధినాయకత్వానికి ఇప్పటికే తాను బేషరతుగా మద్దతు ప్రకటించారని, వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఏక్‌నాథ్ షిండే తెలిపారు. గత 2.5 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం పనితీరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ వచ్చన్నారు. ఆ కారణంగానే ప్రజలు చారిత్రక తీర్పునిచ్చారని చెప్పారు.
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు, క్యాబినెట్ పదవుల్లో వాటాపై ఢిల్లీలో కేంద్ర నేతలతో ఇటీవల సమావేశమైన షిండే ఆ తర్వాత ముంబై చేరుకున్నారు. అనంతరం కీలక సమావేశాలను రద్దు చేసుకుని మూడ్రోజుల కిత్రం తన స్వగ్రామానికి ఆయన వెళ్లిపోయారు.
కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన పలు నాటకీయ పరిణామాల నేపథ్యంలో ముంబైలో అన్ని కార్యక్రమాలను షిండే రద్దు చేసుకుని తన స్వగ్రామానికి వెళ్లిపోయారు. దీంతో మహాయుతి ప్రభుత్వంలో ఆయన పాత్ర ఏమిటనే సస్పెన్స్ మరింత తీవ్రమైంది.
డిసెంబర్ 5న ముంబైలో ప్రమాణ స్వీకారం జరగవచ్చని ప్రచారం జరుగుతుండగా, ఏక్‌నాథ్ షిండే సతారా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లిపోవడంతో ఆయన అగ్రహంతో ఉన్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. షిండే మనసులో ఏముందనే చర్చ జరుగుతోంది.
మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరనే విషయంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఢిల్లీలో బీజేపీ అధిష్టానంతో గురువారం చర్చల తర్వాత శుక్రవారం ముంబైలో జరగాల్సిన మహాయుతి కూటమి సమావేశం రద్దు అయింది.
కొత్త ప్రభుత్వంలో పదవుల పంపకాలపై చర్చించేందుకు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్‌తో సహా షిండే గురువారంనాడు ఢిల్లీలో అమిత్‌షా, జేపీ నడ్డాలను కలిసారు. అగ్రనేతలతో సానుకూల చర్చలు జరిగాయని కూడా సమావేశానంతరం షిండే తెలిపారు.
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను గురువారంనాడు కలుస్తున్నట్టు మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి షిండే తెలిపారు. రెండో సారి ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నానన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు.
మహాయుతి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధిని ప్రజలు విశ్వసించి ఘన విజయం అదించారని, ఇది ప్రజా విజయమని ఏక్‌నాథ్ షిండే అన్నారు. తన రెండున్నరేళ్ల పాలనపై సంతృప్తిగా ఉన్నానని చెప్పారు.
తన కుమారుడిని ఉప ముఖ్యమంత్రిని చేసి ప్రభుత్వంలో పదవులకు తాను దూరంగా ఉండాలని ఏక్‌నాథ్ షిండే చేస్తున్న ప్రతిపాదనతో సొంత పార్టీ నేతలే విభేదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందువల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని వారంటున్నారు.