Home » Eknath Shinde
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మధ్య అంతర్యుద్ధం నడుస్తోందనే ప్రచారం మాత్రం ముమ్మరంగా జరుగుతోంది. అంతా 'కూల్' అని షిండే చెబుతున్నప్పటికీ లుకలుకలు ఉన్నట్టు పలు సంఘటనలు చెబుతున్నాయి.
మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో అసంతృప్తి మొదలైందా అంటే అవుననే అంటున్నారు అక్కడి విశ్లేషకులు. సీఎం హాజరైన పలు కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండే దూరంగా ఉండిపోవడం ఆసక్తికర పరిణామమని వ్యాఖ్యానిస్తున్నారు.
మొన్న ఎయిర్ పోర్టులకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆ తర్వాత ఇటివల ప్రధాని మోదీ ప్రయాణించిన విమానం సమయంలో కూడా అదే జరిగింది. ఆ తర్వాత తాజాగా ఇప్పుడు డిప్యూటీ సీఎంకు కూడా బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
సీఎం ఫడ్నవిస్ నేతృత్వంలో రాష్ట్ర హోం శాఖ ఇటీవల శివసేనకు చెందిన 20 మంది అధికార ఎమ్మెల్యేల 'వై' కేటగిరి భద్రతను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. బీజేపీ, ఎన్‌సీపీ అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేల భద్రతను కూడా తగ్గించనుంది.
హిందూ సైద్ధాంతికత విషయంలో ఉద్ధవ్ థాకరే శివసేన, షిండే వర్గం శివసేన మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో షిండే ప్రయాగ్‌రాజ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బోండేకర్‌కు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ క్యాబినెట్‌లో చోటు దక్కలేదు. దీంతో పార్టీ పదవికి రాజీనామా చేశారు.
కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్‌కు మద్దతిస్తున్నట్టు గవర్నర్‌కు లేఖలు ఇచ్చిన ఏక్‌నాథ్ షిండే, అజితి పవార్ ఆ వెంటనే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒకరిపై మరొకరు 'పంచ్'లు విసురుకున్నారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.
ఎన్నికల ఫలితాలకు, సీఎం ప్రకటనకు మధ్య రెండు వారాల జాప్యం తలెత్తడాన్ని దేవేంద్ర ఫడ్నవిస్ తేలిగ్గా కొట్టివేశారు. సీఎం పదవి అనేది కేవలం సాంకేతిక అంశమేనని, తామిద్దరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటామని, ఇక ముందు కూడా అదే కొనసాగుతుందని తెలిపారు.
బుధవారం ఉదయం విధాన్ భవన్‌లో జరిగిన మహారాష్ట్ర బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా దేవేంద్ర ఫడ్నవిస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ కేంద్ర పరిశీలకులు విజయ్ రూపాని అధికారికంగా ప్రకటించారు.
డిసెంబర్ 5న 'మహాయుతి' కూటమి సర్కార్ ప్రమాణస్వీకారానికి ముంబైలోని ఆజాద్ మైదానం ఓవైపు ముస్తాబవుతుండగా, ఉదయం నుంచి కూటమి ముఖ్య నేతలు ముగ్గురు వేర్వేరు సిటీల్లో ఉండటం చర్చనీయాంశమైంది. దేవేంద్ర ఫడ్నవిస్ ముంబైలో ఉండగా, థానేలో షిండే, ఢిల్లీలో ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ ఉన్నారు.