Home » East Godavari
Andhrapradesh: కరువు రహిత రాష్ట్రంగా చేయాలన్న ఉద్దేశంతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం ఉదయం తాళ్ళపూడి మండలం తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని విడుదల మంత్రి విడుదల చేశారు.
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రెండో రోజు మంగళవారం కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం కాకినాడ కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్, అటవీశాఖ , కాలుష్య నియంత్రణ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.
ప.గో.జిల్లా: పింఛన్ తీసుకోవడానికి వచ్చి మండుటెండలు తట్టుకోలేక మరణించిన 34 మంది వృద్ధుల మృతికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడని, వృద్ధుల మరణానికి కారణమైన జగన్ రాజకీయాల్లో ఉండటానికి అనర్హుడని ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రెండో రోజు మంగళవారం కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్, అటవీశాఖ, కాలుష్య నియంత్రణ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
పిఠాపురం: ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్దిదారులకు పెన్షన్లు అందజేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) వద్ద మొదటి రోజు విదేశీ నిపుణుల బృందం(Foreign Expert Team) పర్యటన ముగిసింది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ(ఆదివారం) అప్పర్ కాపర్ డ్యాం, లోయర్ కాపర్ డ్యాం, స్పిల్ వేలను నిపుణులు పరిశీలించారు.
కాలం కంటే వేగంగా, కాలాన్ని వెనక్కి నెట్టి పనిచేసే కలెక్టర్లే కాదు... ‘కాలజ్ఞానం’ తెలిసిన కలెక్టర్లు కూడా ఉన్నారండోయ్..! పై నుంచి ఏ ఆదేశాలు వస్తాయో మూడు రోజులు ముందే ఊహించి అందుకనుగుణంగా పనిచేసేస్తారు..!
గత వైసీపీ ప్రభుత్వంతో అంటకాగారన్న ఆరోపణల నేపథ్యంలో పలువురు అధికారులపై చంద్రబాబు(CM Chandrababu) సర్కార్ వరసగా బదిలీ వేటు వేస్తోంది. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ ఈ బదిలీలు జరుగుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా(East Godavari) కలెక్టర్ మాధవీలత (Collectors Madhavilatha), గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి (Collectors Venugopal Reddy)పై బుధవారం రోజున బదిలీ వేటు పడింది.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా మాజీ ముఖ్యమంత్రి జగన్(YS Jagan)కు మాత్రం ఇంకా జ్ఞానోదయం కాలేదని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్(Minister Vasamshetti Subhash) అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నవరత్నాలపైనే పూర్తిగా ఆధారపడిన జగన్.. బీసీ, ఎస్సీ, ఎస్టీల పథకాలు ఎత్తేశారని గుర్తు చేశారు.
తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలో డయేరియా ప్రబలింది. ఒకరి మృతి, 25మంది చికిత్స పొందుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు(Pawan Kalyan) మంత్రి వాసంశెట్టి సుభాష్ వివరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కాకినాడ కలెక్టర్‌కు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి చెప్పారు.