Home » Duddilla Sridarbabu
తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారిని ఎత్తుకుపోయి అత్యాచారం చేసి చంపేయడం తీవ్రంగా కలచివేసిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి, దారుణానికి పాల్పడిన వ్యక్తిని చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు.
బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కలిసినా సీట్లు రావట్లేదనే అక్కసుతో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) అన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు ప్రభుత్వ పనితీరే సమాధానం చెబుతోందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో కంటే తమ ప్రభుత్వం అభివృద్ధిలో మార్పు తెస్తుందని... మార్పుకు అడ్డు వస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. తుక్కుగూడలో కాంగ్రెస్ (Congress) తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం నాడు పరిశీలించారు.
Telangana: ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఫోట్ ట్యాపింగ్ వ్యవహారంపై అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఈ అంశంపై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్‌లో అందరూ బయటకి వస్తారన్నారు.
Telangana: భద్రాచలంలో ‘‘ఇందిరమ్మ ఇళ్లు’’ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాముల వారు కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో ఈ పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇందిరమ్మ ఇళ్లు ఐదోది. అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లో నాలుగు పథకాలను అమలు చేసిన రేవంత్ సర్కార్.. తాజాగా ఐదో పథకమైన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కూడా కార్యరూపం దాల్చింది.
ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చెప్పే కట్టుకథలను నమ్మొద్దని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అన్నారు. బుధవారం నాడు ఏబీఎన్‌తో ఆయన మాట్లాడుతూ...బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పదేళ్లలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీను ఎందుకు తెరిపించలేదని ప్రశ్నించారు.
మా నాన్న (శ్రీపాద రావు) ఆశయాలను నెరవేర్చేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) తెలిపారు. శ్రీపాద రావు జయంతి ఉత్సవాలను ప్రభుత్వం తరపున జరుపుతున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
నగరంలోని ట్యాంక్ బండ్‌పై చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్నలాంటి తెలంగాణ ప్రముఖుల విగ్రహాల ఏర్పాటును పరిశీలిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. త్వరలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి విధానపరంగా మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ట్యాంక్ బండ్‌పై ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయాలన్న వక్తల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు.
Telangana: ప్రతిష్టాత్మక 21వ బయో ఆసియా సదస్సుకు హైదరాబాద్ వేదిక అయిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హెచ్‌ఐసీపీలో బయో ఆసియా-2024 సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు 40వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీను పునరుద్ధ రించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, పునరుద్ధరణ కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) తెలిపారు. శనివారం బోధన్‌లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించారు.