Home » Droupadi Murmu
కార్గిల్ 25వ విజయ్ దివస్ (Kargil Vijay Diwas) సందర్భంగా కార్గిల్‌లోని ద్రాస్‌లో యుద్ధవీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ శుక్రవారం సందర్శించారు. యుద్ధంలో ప్రాణాలర్పించిన సైనికులకు నివాళి అర్పించారు. వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అమర జవాన్ల కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) సరికొత్తగా బ్యాడ్మింటన్ ఆడుతూ కనిపించారు. రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan)లో బుధవారం సాయంత్రం స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్(34)తో ద్రౌపది ముర్ము (66)సరదాగా బ్యాడ్మింటన్ ఆడారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో(Hatras) జరిగిన తొక్కిసలాటలో(Hathras Stampede) మృతి చెందిన వారి కుటుంబాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) సంతాపం తెలిపారు.
దేశం పురోగతి వైపు వెళ్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. 18వ లోక్‌సభ తొలి సమావేశాల్లో ఆమె మొదటిసారి ప్రసంగించారు. లోక్‌సభ సమావేశాల్లో భాగంగా మొదటి రెండు రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం చేయగా.. మూడోరోజు స్పీకర్ ఎన్నిక జరిగింది. నాలుగో రోజైన ఇవాళ రాష్ట్రపతి ప్రసంగించారు.
పశ్చిమ బెంగాల్లో సోమవారం ఉదయాన్నే ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీ కొన్న ఘటనలో మృతుల సంఖ్య 15కి చేరింది. దాదాపు 60 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu), ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.
బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అని సామరస్యం, ఐక్యతను పెంపొందిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈద్ ఉల్ అదా సందర్భంగా ముర్ము, ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరువురు తమ ఎక్స్ అకౌంట్లో బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు.
ఢిల్లీలోని ఎర్రకోటపై 24 ఏళ్ల కిందట ఉగ్రదాడులు జరిగిన విషయం విదితమే. అయితే ఈ కేసులో దోషిగా నిర్ధారణ అయిన పాకిస్థాన్ ఉగ్రవాది(Pakistan Terrorist) మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్(Mercy Petition) దాఖలు చేశాడు.
లోక్ సభ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించిన ఎన్డీఏ కూటమి.. కేంద్ర పగ్గాలు మరోసారి చేపట్టింది. మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు నరేంద్ర మోదీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. శుక్రవారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మోదీ కలిశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మోదీని ముర్ము కోరారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 17వ లోక్‌సభ ను రద్దు చేశారు. ప్రస్తుత లోక్‌సభను రద్దు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ) సారధ్యంలోని కేంద్ర క్యాబినెట్ బుధవారం ఉదయం సిఫారసు చేసింది.