Home » Doctors strike
ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో మహిళా ట్రైనీ డాక్టరుపై అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అనూహ్య చర్యకు దిగింది. సుమారు 43 మంది డాక్టర్లను బదిలీ చేస్తూ శనివారంనాడు ఆదేశాలు జారీ చేసింది.
కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా కాకరేపుతోంది. దేశంలో వైద్యులంతా ఐక్యమై రోడ్డెక్కారు. ముందు తమ ప్రాణాలకు రక్షణ కల్పిస్తే.. తాము రోగుల ప్రాణాలు కాపాడతామంటూ వైద్యులు నినదిస్తున్నారు.
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్-హాస్పిటల్‌లో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం ఘటనకు నిరసనగా, హాస్పిటల్స్‌లో భద్రతపై సోమవారం దేశవ్యాప్త ఆందోళనలకు దిగిన వైద్యులు మంగళవారం కూడా కొనసాగిస్తున్నారు. హాస్పిటల్స్ వద్ద సరైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.