Home » Doctor
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్, మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ సహా ఏడుగురు వ్యక్తులపై సీబీఐ శనివారంనాడు పోలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించింది. సంజయ్ రాయ్‌కు జైలులో పోలీగ్రాఫ్ టెస్ట్ జరపగా, సందీప్ ఘోష్, మరో నలుగురు డాక్టర్లను ఏజెన్సీ కార్యాలయంలో పరీక్షలు నిర్వహించింది.
ఆర్జీ కర్ ఆస్పత్రిలో మహిళా జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం కేసుకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్పత్రి చెస్ట్ విభాగం సెమినార్‌హాల్‌లో దారుణం చోటు చేసుకున్న సంగతి ఇప్పటికే వెల్లడి కాగా..
కోల్‌కతా మెడికల్ కళాశాలలో పీజీ వైద్యురాలిపై హత్యాచారానికి నిరసనగా జూడాలు ఆందోళన కొనసాగిస్తున్నారు. పది రోజులుగా విధులను బహిష్కరిస్తున్నారు. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు వారిని శుక్రవారం చర్చలకు ఆహ్వానించారు. జూడాలకు భద్రతకు చర్యలు తీసుకుంటామని, ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి సీనియర్ వైద్యులు డాక్టర్ భీమసేనాచారి, డాక్టర్ ...
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ విచారణ వేగం పెరగడంతో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నేరం జరిగినట్టు భావిస్తున్న ఆసుపత్రి సెమినార్ హాలు డోర్ బోల్డ్ విరిగిపోవడం తాజాగా సీబీఐ దృష్టికి వచ్చింది.
కోల్‌కతా మెడికల్ కళాశాలలో పీజీ వైద్యురాలి హత్యాచార ఘటనను కళ్లకు కడుతూ.. జూడాలు నాటకాన్ని ప్రదర్శించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనలో భాగంగా.. జిల్లా ఆస్పత్రిలో గురువారం రిలే దీక్షలు చేపట్టారు. వీరికి ఎనజీఓ నాయకులు సంఘీభావం తెలిపారు. యువతులపై ...
ఆస్పత్రులకు చికిత్స కోసం వచ్చే మహిళలు, పిల్లల నగ్న చిత్రాలను రహస్య కెమెరాలతో చిత్రీకరించటమేగాక పలువురిపై లైంగికదాడులకు పాల్పడిన ఉమర్ అజీజ్ అనే భారతీయ డాక్టర్‌ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ: కోల్‌కతా కేసులో డాక్టర్ల ఆందోళ కొనసాగుతోంది. ఆర్జీకర్ ఆస్పత్రిపై అర్ధరాత్రిపై విధ్వంసం సృష్టించిన ఘటనలో ఇద్దరు ఏసీపీలు, ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో వేటు పడింది. ఆస్పత్రిపై విధ్వంసం సృష్టించిన 40 మంది దుండగులు అరెస్టు అయ్యారు.
Telangana: ‘‘వైద్యో నారాయణో హరి’’.. వైద్యులు దేవుళ్లతో సమానమంటారు పెద్దలు. అత్యవసరంగా వచ్చిన వారికి వైద్యం అందిచడం అనేది డాక్టర్ల ధర్మం. కానీ ఓ చిన్నారి విషయంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండుప్రాణం బలైంది. ఫార్మాలిటీ పేరుతో ఓ చిన్నారి మృతకి కారణమైంది పారమిత ఆస్పత్రి. హాస్పటల్లో ఫార్మాలిటీని పూర్తి చేయడానికి అరగంట సమయం పట్టింది...
ఆస్పత్రుల్లో వైద్యుల భద్రత కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు సుప్రీంకోర్టు తొమ్మిది మంది సభ్యులతో కూడిన జాతీయ టాస్క్‌ఫోర్స్ (ఎన్‌టీఎ్‌ఫ)ను ఏర్పాటు చేసింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల, ఆస్పత్రిలో తీవ్ర సంచలనం సృష్టించిన
కోల్ కతా వైద్యురాలి మృతి ఘటన ప్రకంపనలు రేపుతోంది. నిందితులపై చర్యలు తీసుకోవాలని యావత్ భారతవని కోరుతోంది. వైద్యురాలి మృతికి సంఘీభావంగా పలువురు తమ సోషల్ మీడియా అకౌంట్లలో స్టేటస్‌ను బ్లాక్ కలర్‌గా మార్చారు. తమదైన శైలిలో నిరసన తెలియజేస్తున్నారు. ఆ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేరారు.