Home » DMK
ప్రముఖ హీరో, టీవీకే పార్టీ చీఫ్ విజయ్ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులను మాయమాటలతో మోసం చేయొద్దంటూ ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం తమ మనుగడను సాధించిన దాఖలాలు లేవని ఆయన హెచ్చరించారు.
Minister Satyakumar: డీఎంకే పార్టీపై మంత్రి సత్యకుమార్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తమిళనాడులో ఎన్నికలు ఉన్నందునే డీలిమిటేషన్‌ను డీఎంకే పార్టీ తెరమీదకు తెచ్చిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు.
నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నైలో డీఎంకే నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి టీడీపీ, జనసేన హాజరు కాలేదు.
Janasena party: తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో డీలిమిటేషన్‌పై ఇవాళ సమావేశం జరిగింది. ఈ భేటీలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాల నేతలు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో పాల్గొనాలని జనసేనకు కూడా ఆహ్వానం పంపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సమాచార సాధానాలకు చేతినిండా పని కల్పిస్తున్నారు. అలాగే మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికల సమరం కూడా జరగనుండడంతో అన్ని పార్టీలు సిద్దమతున్నాయి. దీంతో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి.
ఒక్క నోటిమాట ఆయన పదవికే ఎసరు తెచ్చింది. అందుకే జాగ్రత్తగా మాట్లాడాలని పెద్దలు ఊరికే చెప్పలేదు కాబోలు. పార్టీ పదవిని చేపట్టిన 24 రోజుల్లోనే డీఎంకే ధర్మపురి తూర్పు జిల్లా కార్యదర్శి పి.ధర్మసెల్వన్‌ను ఆ పదవి నుండి పార్టీ అధిష్టానం తొలగించింది.
టాస్మాక్ అవినీతిని ఖండిస్తూ త్వరలోనే ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటిని ముట్టడించనున్నట్లు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఆందోళనా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. టాస్మాక్ సంస్థలో రూ.1,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.
హిందీ భాషా వివాదం క్రమంగా ముదురుతోంది. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై డీఎంకే నేతలు తీవ్రంగా స్పందించారు. అయితే ఏం అన్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డీెఎంకే ఎంపీ కనిమొళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విభాగం కేంద్ర ప్రభుత్వ శాఖగా పనిచేస్తోందంటూ ఆమె విమర్శించారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారితీశాయి.
ప్రస్తుత డీఎంకే ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా మోసపూరితంగా ఉందని ఆయన విమర్శించారు.