• Home » DK Aruna

DK Aruna

Modi Cabinet: మోదీ కొత్త కేబినెట్ ఇదే.. తొలి విడతలో 57 మంది.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరంటే..

Modi Cabinet: మోదీ కొత్త కేబినెట్ ఇదే.. తొలి విడతలో 57 మంది.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరంటే..

వరుసగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ రాత్రి ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో రాత్రి 7:15 గంటలకు మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా.. ఆయనతో పాటు 57 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.

Modi 3.0 Cabinet: తెలుగు రాష్ట్రాలకు ఆరేడు.. ఎవరెవరంటే..!?

Modi 3.0 Cabinet: తెలుగు రాష్ట్రాలకు ఆరేడు.. ఎవరెవరంటే..!?

కేంద్ర మంత్రివర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఆరు నుంచి ఏడుగురికి మంత్రి పదవులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిలో టీడీపీ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరు ఉండవచ్చని తెలుస్తోంది. మంత్రి పదవులు వరించే అవకాశం ఉన్న వారిలో తెలుగుదేశం నుంచి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.

BJP: తెలంగాణకు 2 కేంద్ర మంత్రి పదవులు?

BJP: తెలంగాణకు 2 కేంద్ర మంత్రి పదవులు?

దేశంలో మూడోసారి ఎన్‌డీయే కూటమి అధికారం చేపట్టబోతోంది. ఆదివారం సాయంత్రం ప్రధానిగా మోదీతో పాటు కొద్దిమంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల కేటాయింపుపై ఢిల్లీలో ముమ్మర కసరత్తు జరుగుతోంది. గురువారమే ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బీజేపీ, సంఘ్‌ పెద్దలు భేటీ అయ్యారు. బీజేపీ నాయకులకు, మిత్రపక్షాలకు కేటాయింపులపై చర్చించారు. సొంతంగా మ్యాజిక్‌ మార్కు దాటని బీజేపీకి దక్షిణాదిలో అత్యధిక స్థానాలు వచ్చిన రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా ఆ పార్టీతో సమానంగా బీజేపీ 8 స్థానాలు సాధించింది.

Delhi: తెలంగాణకు 2 కేంద్ర మంత్రి పదవులు?

Delhi: తెలంగాణకు 2 కేంద్ర మంత్రి పదవులు?

దేశంలో మూడోసారి ఎన్‌డీయే కూటమి అధికారం చేపట్టబోతోంది. ఆదివారం సాయంత్రం ప్రధానిగా మోదీతో పాటు కొద్దిమంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల కేటాయింపుపై ఢిల్లీలో ముమ్మర కసరత్తు జరుగుతోంది.

Hyderabad: మంత్రి పదవి కోసం లాబీయింగ్‌ చేయను

Hyderabad: మంత్రి పదవి కోసం లాబీయింగ్‌ చేయను

కేంద్ర మంత్రి పదవి కోసం తాను లాబీయింగ్‌ చేయనని, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా పని చేస్తానని బీజేపీ సీనియర్‌ నేత, ఆ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన డీకే అరుణ అన్నారు. బుధవారం ఆమె విలేకరులతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.

TG Politics: కేంద్రమంత్రి పదవిపై అరుణ హాట్ కామెంట్స్

TG Politics: కేంద్రమంత్రి పదవిపై అరుణ హాట్ కామెంట్స్

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన మహబూబ్‌నగర్‌ (Mahbubnagar) పార్లమెంట్ స్థానంలో (Parliament elections) బీజేపీ అభ్యర్థి డీకే అరుణ(DK Aruna) సంచలన విజయం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

TG News: కమల వికాసం.. కాంగ్రెస్‌ దరహాసం..

TG News: కమల వికాసం.. కాంగ్రెస్‌ దరహాసం..

కమలం వికసించింది.. కాంగ్రెస్‌ మురిసింది.. గులాబీ వాడింది. తెలంగాణలో కమలం, హస్తం పార్టీలు ఫిఫ్టీ ఫిఫ్టీ షేరింగ్‌ సాధించాయి. ఓట్లు, సీట్లలో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. నాలుగు నుంచి ఎనిమిది సీట్లకు పెరగడంతోపాటు ఓట్ల శాతమూ21 శాతానికి ఎగబాకింది. అధికార కాంగ్రెస్‌ కూడా ఎనిమిది సీట్లలో విజయకేతనం ఎగరేసింది. పదేళ్లపాటు రాష్ట్రంలో చక్రం తిప్పిన బీఆర్‌ఎస్‌ మాత్రం ఈసారి బొక్కబోర్లా పడింది.

Lok Sabha Election 2024: పాలమూరులో గంజాయి మొక్కలను బొందపెడతాం.. రేవంత్ మాస్ వార్నింగ్

Lok Sabha Election 2024: పాలమూరులో గంజాయి మొక్కలను బొందపెడతాం.. రేవంత్ మాస్ వార్నింగ్

ఉమ్మడి పాలకుల కంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కువ మోసం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. బీజేపీ నేత డీకే అరుణకు గుర్తింపు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. నేడు పాలమూరు జిల్లాలో పర్యటించిన మోదీ పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా గురించి మాట్లాడకపోవడం బాధాకరమని చెప్పారు.

 Lok Sabha Elections 2024: నువ్వు చీర కట్టకొని అలా వెళ్లు.. కేటీఆర్‌కు రేవంత్ సవాల్

Lok Sabha Elections 2024: నువ్వు చీర కట్టకొని అలా వెళ్లు.. కేటీఆర్‌కు రేవంత్ సవాల్

తెలంగాణలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావట్లేదని పదే పదే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ హామీలు రాష్ట్రంలో ఎక్కడ అమలవుతున్నాయో నిరూపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి(CM Revanth Reddy) మరోసారి సవాల్‌ విసిరారు. ఈ సవాల్‌కు రేవంత్ ప్రతి సవాల్ విసిరారు.

Revanth Reddy: ఈ ఎన్నికల్లో బీజేపీకి కర్రుకాల్చి వాత పెట్టండి

Revanth Reddy: ఈ ఎన్నికల్లో బీజేపీకి కర్రుకాల్చి వాత పెట్టండి

రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి ఈ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టాలని తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కొత్తకోట‌లో కార్నర్ మీటింగ్‌లో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి