Home » Diwali
రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. "చీకట్లను ఛేదిస్తూ.. మార్పును ఆశిస్తూ.. వెలిగిన దీపం జన జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని ఆశిస్తూ.. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి" అని రేవంత్ ఆకాంక్షించారు.
దీపావళి వైభవమంతా బాణసంచాలోనే ఉంది. పిల్లలు, పెద్దలు అంతా బాణసంచా కాల్చడానికి పండుగ కోసం ఎదురు చూస్తారు.
అయోధ్య పురవీధుల్లో లక్షలాది జనవాహిన మధ్య రామలక్షణ వేషధారులు రథంపై ఊరేగగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా రథం లాగి తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. లేజర్ షోలు, డ్రోన్ షోలు, రామాయణ ఘట్టాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో అయోధ్య మారుమోగింది.
అక్టోబర్ 31(గురువారం)న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా దేశానికి ఆమె చేసిన సేవలను సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. తన ప్రతి రక్తపు బొట్టు దేశ పటిష్టతకు తోడ్పతుందని చెప్పిన మహనీయురాలు ఇందిరా గాంధీ అని రేవంత్ కొనియాడారు.
దేశంలో అత్యంత ఖరీదైన స్వీట్ గురించి మీకు తెలుసా. దాన్ని కొనాలంటే మీ ఆస్తులు అమ్మాల్సిందే. ఇంతకు ఆ స్వీట్ ప్రత్యేకతేంటి. ఆ వివరాలు తెలుసుకుందాం.
ప్రతి ఏడాది రకరకాల టపాసులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ధరలు కూడా ప్రతి ఏడాది పెరుగుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు దీపావళికి టపాసులు కొనాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. మరోవైపు అసలు ధరకంటే టపాసుల ధరను అమాంతం పెంచి కొందరు విక్రయిస్తున్నారు. అన్ని దుకాణాల్లో టపాసుల ధరలు..
ప్రతి దీపావళి పండుగను సరిహద్దుల్లోని ఫ్రంట్ పోస్ట్ బలగాలతో జరుపుకోవడం ప్రధాని పదేళ్లుగా కొనసాగిస్తుండగా, దసరా పర్వదినాన ఆయుధ పూజ నిర్వహించడాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. 2019లో రక్షణ శాఖ మంత్రి ఈ ఆయుధ పూజ ప్రారంభించారు.
దీపావళి వచ్చేసింది. పండుగ రోజు ఇష్టమైన వారికి బహుమతి ఇచ్చి సర్ ప్రైజ్ చేస్తే కలిగే అనుభూతి చెప్పలేనిది. బహుమతి అనగానే చీరలు, గిఫ్టులు, ఎలక్ట్రానిక్ గ్యాడెట్లు మన మైండ్లోకి వస్తాయి.
దీపావళి పండుగ సందర్భంగా అదనంగా మరోరోజు సెలవు పొడిగించడంతో ప్రభుత్వ కార్యాలయాలు, సెకండరీ స్కూళ్లన్నీ నవంబర్ 1న మూతపడతాయి. ఈ ఏడాది దీపావళి వేడుకలు అక్టోబర్ 31వ తేదీన మొదలై నవంబర్ 1వ తేదీ సాయంత్రం వరకూ కొనసాగుతాయి.
హిందూ ఆధ్యాత్మిక కేంద్రమైన అయోధ్య.. ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోకి వస్తుంది. అయోధ్యలోని భవ్య రామాలయం ఈ ఏడాది మొదట్లో ప్రారంభమైంది. దీపావళి సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుధవారంనాడు దీపోత్సవ్‌ను ఘనంగా నిర్వహించనుంది.