• Home » Districts

Districts

Suryakumar Yadav : అనంతకు స్కై..

Suryakumar Yadav : అనంతకు స్కై..

అంతర్జాతీయ క్రికెట్‌లో వైవిధ్య షాట్లతో స్కైగా పేరొందిన భారత జట్టు స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మంగళవారం నగరానికి చేరుకున్నారు. ఓ హోటల్‌లో దిగాడు. స్థానిక అనంతపూర్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఏసీజీ)లో ఈనెల 19వ తేదీ నుంచి నిర్వహించనున్న దులీప్‌ ట్రోఫీ మూడో రౌండ్‌ ...

Ycp : దౌర్జన్యకాండ..!

Ycp : దౌర్జన్యకాండ..!

మండలంలోని చెదళ్ల గ్రామంలో మంగళవారం వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అక్రమించిన వాటర్‌ ప్లాంట్‌, ట్రెంచను తొలిగించేందుకు వెళ్లిన రెవెన్యూ, పోలీసులను అడ్డుకున్నారు. అక్రమణలు తొలిగించేందుకు వెళ్లిన ఎక్స్‌కవేటర్‌ను వైసీపీ మద్దతు సర్పంచ, అనుచరులు ధ్వంసం చేశారు. పోలీసులు చోద్యం చూశారు. వైసీపీ కార్యకర్తలను అదుపు చేయడంలో విఫలమయ్యారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ఈ ...

MEO : శ్రుతిమించిన చేతివాటం..!

MEO : శ్రుతిమించిన చేతివాటం..!

చేతి వాటం శ్రుతిమించింది. కొందరు మండల విద్యాశాఖాధికారు(ఎంఈఓ)లు ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లనే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లను సైతం టార్గెట్‌ చేసి దోచేస్తున్నారు. కొందరు ఎంఈఓలు.. విజిట్లు చేసి, బెదిరిస్తూ... డబ్బు గుంజుతున్నారు. మరికొందరు.. ఉపాధ్యాయ సంఘాలను తమ చేతుల్లో పెట్టుకుని టీచర్లను టార్గెట్‌ చేసి, చర్యలు తీసుకుంటామంటూ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ...

 Agros : అంపశయ్యపై ఆగ్రోస్‌..?

Agros : అంపశయ్యపై ఆగ్రోస్‌..?

రైతులకు మెరుగైన సేవలు అందించిన ఏపీ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ (ఏపీ ఆగ్రోస్‌) నిర్వహణ అంపశయ్య మీదకు చేరినట్లు అగుపిస్తోంది. గత వైసీపీ పాలనలో సంస్థ నిర్వహణ చాలా అధ్వానంగా మారింది. 1968 సంవత్సరంలో రాష్ట్ర స్థాయితో పాటు జిల్లాలో ఏపీ ఆగ్రోస్‌ రీజినల్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సంస్థ ఏర్పాటు చేసిన తొలినాళ్లల్లో పెద్ద ట్రాక్టర్లు, బుల్డోజర్లు, ఎక్స్‌కవేటర్లను రైతులకు అద్దెకు ఇచ్చేవారు. తద్వారా పొలాల్లో పలు రకాల పనులు చేయించేవారు. పొలాలను...

Ycp, Tdp Leaders : యాపారం మొదలైంది..!

Ycp, Tdp Leaders : యాపారం మొదలైంది..!

గత వైసీపీ పాలనలో మాదిరే ప్రస్తుతం కొంతమంది భూ కబ్జాలకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సులభంగా డబ్బు సంపాదించడం కోసం అక్రమదారులను ఎంచుకుని బెదిరిస్తున్నట్లు సమాచారం. లేనిదానికి ఉందన్నట్లుగా సమస్యను సృష్టించి సొమ్ము చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఇందులో అధికార, ప్రతిపక్షాలు మిలాఖత కావడం గమనార్హం. జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న 73 సెంట్ల ఆయిల్‌ మిల్‌ స్థలంపై కబ్జాదారులు కన్నేశారు. ఈ స్థలం అనంతపురం- తాడిపత్రి ప్రధాన రహదారి ...

 Animators : నమ్మితే.. ముంచేశాడు

Animators : నమ్మితే.. ముంచేశాడు

పొదుపు మహిళా సంఘాల సొమ్మును స్వాహా చేస్తూ యానిమేటర్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఎవరికైనా అనుమానం వచ్చి ఆరా తీస్తే బాగోతాలు బయటకు వస్తున్నాయి. తాజాగా కళ్యాణదుర్గంలోని ఓ బ్యాంకులో నిధులు స్వాహా బాగోతం బయటికి వచ్చింది. మండలంలోని మల్లికార్జునపల్లిలో పొదుపు సంఘం మహిళలు తాము తీసుకున్న రుణాలను వాయిదాలపై ప్రతి నెలా చెల్లించేవారు. గతంలో యానిమేటర్‌గా పనిచేసిన ఓ...

Teachers : వీళ్లకు బుద్ధి చెప్పేదెవరు?

Teachers : వీళ్లకు బుద్ధి చెప్పేదెవరు?

డీఈఓను బెదిరిస్తున్నారా..? విద్యాశాఖను కుల రాజకీయాలు శాసిస్తున్నాయా? కుల కుంపట్లు పెట్టుకున్న కొందరు ఎంఈఓలు వివాదాల్లో చిక్కుకుని రోడ్డుపైకి వచ్చారా...?, కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలు, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న పోస్టులు, నిరసనలను చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. డీఈఓను కొందరు ఎంఈఓలు, మరికొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారని శుక్రవారం పెట్టిన ఓ పోస్టు వైరలైంది. ...

Alternative crops : ప్రత్యామ్నాయమూ అంతే..!

Alternative crops : ప్రత్యామ్నాయమూ అంతే..!

జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. ఈనెలాఖరు దాకా ప్రత్యామ్నాయ పంటలు సాగుకు అదును సమయం ఉంది. ఎర్రనేలల్లో పంటలు సాగు చేయడానికి రైతులు అన్ని పనులు పూర్తి చేసి, వాన కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని యాడికి మండలంలో పచ్చజొన్న, పెద్దవడుగూరు మండలంలో కొర్ర, పత్తి పంటలు సాగు చేశారు. మిగతా ప్రాంతాల్లో వర్షం వస్తే ఉలవ సాగు చేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నా రు. అయితే ...

Immersion Festival : నిమజ్జన  శోభ

Immersion Festival : నిమజ్జన శోభ

అనంతపురం నగరంలో ఐదురోజులపాటు విశేష పూజలు అందుకున్న గణనాథుడు బుధవారం గంగమ్మ ఒడికి చేరారు. అంతకు మునుపు మండపాల వద్ద పెద్దఎత్తున అన్నదానం చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సప్తగిరి సర్కిల్‌లోని వినాయక్‌ చౌక్‌ వరకూ శోభాయాత్రలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి దారిపొడవునా భక్తులు బారులు తీరారు. ఆకట్టుకునే వేషధారణలతో రంగులు చల్లుకుంటూ యువత ఉత్సాహంగా వేడుకలలో పాల్గొంది. వినాయక్‌ ...

Gun : రాజీకొస్తావా..  కాల్చిపారేయాలా..?

Gun : రాజీకొస్తావా.. కాల్చిపారేయాలా..?

మండల పరిధిలోని సుద్దకుంటపల్లిలో గంగాధర్‌ అనే వ్యక్తి నాటు తుపాకీతో మంగళవారం హల్‌చల్‌ చేశాడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైన కేసులో రాజీకి రావాలని బెదిరించాడు. దీంతో బాధితులు ఎదురు తిరిగి గంగాధర్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. గంగాధర్‌ తనను వేధిస్తున్నారని సుద్దకుంటపల్లికి చెందిన ఎంపీటీసీ సాయిలీల ఈ ఏడాది మార్చిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి