Home » Districts
మండలంలోని గడేకల్లు గ్రామంలో వెలసిన వేములవాడ భీమలింగేశ్వరస్వామి మహా రథోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ఉదయం స్వామి వారిని ప్రత్యేక పూలతో అలంకరించారు. అనంతరం స్వామికి ప్రీతి పాత్రమైన మద్యాన్ని, మాంసాన్ని నైవేద్యంగా పెట్టి పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా తెల్లరుజామున ఉత్సాయంను ఆలయం వద్ద నుంచి గ్రామ చావడి వరకూ లాగారు. సాయంత్రం నిర్వహించిన మహా రథోత్సవ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. కర్నూలు, బళ్లారి, అనంతపురం, బెంగళూరు, వంటి ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ..
వైద్యులు, సిబ్బంది కమిట్‌మెంట్‌తో పని చేయాలని జిల్లా కలెక్టరు డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. జిల్లా ఆస్పత్రిలో మంగళవారం తలసీమియాపై నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ డాక్టర్ వృత్తికి సమాజంలో చాలా గౌరవం ఉంటుందని, మనం ప్రజలకు మంచిగా సేవలందించినపుడు అది మరింత పెరుగుతుందన్నారు. రోగులతో మర్యాదగా, ప్రేమగా మెలగాలని డాక్టర్లకు సూచించారు. తాను డాక్టర్‌గా పని చేసిన మారుమూలప్రాంతంలో ఎదురైన ఇబ్బందులు, ప్రజలు గౌరవించిన తీరును తెలిపారు. ఇప్పటికీ చాలా మంది వైద్యం కోసం ఆర్‌ఎంపీల వద్దకు వెళుతున్నారంటే పేషంట్ రాగానే ఆప్యాయంగా పలకరించి వైద్యం
రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్‌లు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.
అనంతపురం నగరపాలికలో ప్రభుత్వ సర్వేయర్ లేకపోవడంతో భూ సమస్యలున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏడాదిగా సర్వేయర్ పోస్టు ఖాళీగా ఉన్నా పట్టించుకునే నాథుడే లేడు. ఈక్రమంలో ఇరుగు పొరుగు వారి మధ్య స్థల వివాదాలు గొడవలకు దారి తీస్తున్నాయి. సర్వే చేసి ఎవరి హద్దు ఎక్కడి వరకు ఉందో చెప్పేవారు లేరు. ఇలాంటి చిన్న చిన్న వ్యవహారాలు నగరంలోని ప్రతి డివిజన్లోనూ ఉండేవే. నగరంలో ఆక్రమించిన భూములు, ...
వృద్ధులు, దివ్యాంగులు, విభిన్న ప్రతిభావంతులు, ఒంటరి మహిళలు, వితంతువులు, అంతరించిపోతున్న వృత్తులవారి జీవనానికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వాలు సామాజిక భద్రత పింఛన్లను అందిస్తున్నాయి. నెల నెలా వచ్చే సొమ్ము ఆ వర్గాలవారు ఆత్మగౌరవంతో జీవించేందుకు కొంత ఆసరా అవుతున్నాయి. కానీ వైసీపీ హయాంలో వీటినికూడా పక్కదారి పట్టించారు. పింఛన్ల మంజూరు, పంపిణీలో కీలకంగా వ్యవహరించిన వలంటీర్లు కొందరు ప్రభుత్వం అందించే పింఛన్లను...
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాదాపు రెండునెలల తర్వాత తాడిపత్రికి వెళ్లారు. అక్కడి పోలీ్‌సస్టేషనలో శనివారం జామీను పత్రాలను సమర్పించారు. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లు, రాళ్లదాడుల నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఆయన అనంతపురంలో ఉంటున్నారు. ఈ నెల 15న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయింది. దీంతో జామీను పత్రాలను పోలీసులకు అందించారు. రెండు రోజుల క్రితం మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో పెద్దారెడ్డి తాడిపత్రికి రావడం ఉత్కంఠ రేపింది. శాంతిభద్రతల సమస్య ...
కనుచూపు మేరలో కొండలు.. పచ్చ పచ్చని వృక్షాలు.. కమ్ముకున్న పొగ మంచు.. కశ్మీరు లోయ అందాలను తలపిస్తున్నాయి కదా..? కనిపించేదంతా నిజం కాదు..! ఇది డంపింగ్ యార్డు చిమ్ముతున్న విషం..!...
టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో నామినేటెడ్ పదవుల పంపకానికి అధినాయకత్వాలు సిద్ధమయ్యాయి. శ్రమ జీవులు, పోరాటాల వీరులకు న్యాయం జరిగే రోజులు వచ్చాయి. జాబితాల రూపలకల్పన ప్రక్రియ మొదలైంది. వైసీపీ హయాంలో ఎవరెవరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు..? పార్టీ కోసం ఎంతగా కష్టపడ్డారు..? ఎన్ని కేసులను భరిస్తున్నారు..? శ్రేణులకు ఏ స్థాయిలో ఉండగా నిలిచారు..? ఎలాంటి త్యాగాలు చేశారు..? ఈ ప్రశ్నలకు జవాబులే ప్రాతిపదికగా జాబితాలు తయారవుతున్నాయి. అందులో తమ పేరు ఉండాలని, కుర్చీ తమకే దక్కాలని ఆశావహులు ప్రయత్నాలను ప్రారంభించారు. ...
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగు పెడితే పంచె విప్పి కొడతామని మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. గెలిచినా, ఓడినా ఫ్యాక్షన మొదలు పెడతానని పెద్దారెడ్డి బహిరంగంగా చెప్పినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పెద్దారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఆయనతోపాటు ఆయన ఇద్దరు కొడుకులను జిల్లా నుంచి బహిష్కరించాలని డిమాండ్ చశారు. మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే వైసీపీ హయాంలో ..
మిడ్ పెన్నార్ 5వ దక్షిణ కాలువ చివరి ఆయకుట్టు భూములకు నీరు అందక ఏకంగా మూడు దశాబ్దాలు అయింది. ఒకప్పుడు పండ్ల తోటలు, పచ్చని పైర్లతో కళకళలాడిన ప్రాంతం ఇప్పుడు దీన స్థితిలో ఉంది. వర్షాలు లేక, కాలువ నీరు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోరు బావులు నిర్వీర్యం కావడంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. కొందరు రైతులు పెన్నా నదిలోకి కిలోమీటర్ల పొడవున పైప్‌లైన ఏర్పాటు చేసుకుని.. వర్షాకాలంలో సాగుకు నీటిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు...