Home » Districts
అక్రమ ట్రాన్సపోర్టర్లపై జిల్లా యంత్రాంగం నిఘా ఉంచిన నేపథ్యంలో ఇక నుంచి ఇసుక సమస్యకు చెక్ పడునుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇసుక అందించేందుకు ఇప్పటికే శ్రీకారం చుట్టింది. అయితే గత ప్రభుత్వంలో ఆదాయవనరుగా భావించిన కొందరు ట్రాన్సపోర్టర్లు ఇప్పటికీ ఇసుకను అధిక ధరకు విక్రయిస్తూ ప్రభుత్వంపై బురద జల్లేందుకు యత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక పాలసీని తీసుకువచ్చారు. వైసీపీ ఐదేళ్ల ..
జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల (సీహెచసీలు) పరిస్థితి దారుణంగా ఉంది. రోగులకు టిఫెన, పాలు, భోజనం అందించాల్సి ఉంది. కానీ జిల్లాలో ఒకటి, రెండు చోట్ల మాత్రమే వాటిని సరఫరా చేస్తున్నారు. మిగిలిన ఏ ఆస్పత్రిల్లో వాటిని సరఫరా చేయకపోవడంతో రోగులు అన్నమో రామచంద్రా అని అలమటిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం సక్రమంగా నిర్వహించకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. జిల్లాలో వైద్యవిధాన పరిషతశాఖ పరిధిలో 11 సీహెచసీలు, ఏరియా ఆస్పత్రులు, సీడీ ఆస్పత్రి ఉన్నాయి. తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, అనంతపురం పాతూరు సీడీ ఆస్పత్రి, గుత్తి, కళ్యాణదుర్గం, ఉరవకొండ, పామిడి, శింగనమల, కణేకల్లు, కొనకొండ్లలో ఈ ...
ఉన్నత విద్యను అందించే విశ్వవిద్యాలయాలకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది. నిర్వహణ కోసం పాలక మండలిని (ఈసీ) ఏర్పాటు చేస్తారు. అభివృద్ధి పనులు, కోర్సులలో ప్రవేశాలు, భవన నిర్మాణాలు, సిబ్బంది నియామకం, ప్రమోషన్లు.. ఇలా అన్నింటిపై ఈసీ నిర్ణయం తీసుకుంటుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈసీలో సభ్యులుగా చేరేందుకు చాలామంది పోటీ పడతారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు తమకు నచ్చిన వారిని సభ్యులుగా చేర్పించి, ఆర్థిక ప్రయోజనాలు పొందారని వర్సిటీల వర్గాలు మండిపడుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనా పాత ఈసీలే కొనసాగుతున్నాయి. ప్రభుత్వం మారినందున.. ఈసీని కూడా మార్చాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ...
బళ్ళారి రాఘవ మానవతా కళాప్రపూర్ణుడు అని వక్తలు కొనియాడారు. ఆయన 144వ జయంతిని పురస్కరించుకుని లలితకళా పరిషత్‌లో శుక్రవారం బళ్లారి రాఘవ స్మారక పురస్కారాలను ప్రదానం చేశారు. పరిషత అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాయలసీమ బలిజ సంఘం అధ్యక్షుడు శంకరయ్య, పరిషత ప్రధాన కార్యదర్శి, న్యాయవాది గాజుల పద్మజ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బళ్లారి రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలువురు చిన్నారులు శాస్త్రీయ నృత్యాలతో అలరించారు. తదనంతరం 2024 సంవత్సరానికి బళ్లారి ...
సంక్షేమ వసతి గృహాలకు అసలే గదుల కొరత వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో ఉన్న గదులను కూడా పాత సామాను భద్రపరచడానికి వినియోగిస్తుండడంతో విద్యార్థులు ఇరుకు గదుల్లో మరింత ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని పలు వసతి గృహాల గదుల్లో కాలం చెల్లిన ట్రంకు పెట్టెలు, వంటసామగ్రి తదితర వస్తువులతో నింపేస్తున్నారు. దాదాపు పదేళ్లుగా తుప్పుపట్టిన, విరిగిపోయిన ట్రంకు పెట్టెలు, వంట సామగ్రి పేరుకుపోవడంతో వాటిని ఎక్కడుంచాలో తెలియక వసతి గృహాల్లోని విద్యార్థుల గదుల్లో డంప్ చేశారు. దీంతో విద్యార్థులకు గదుల కొరత ఏర్పడుతోంది. వీటిని ..
వైద్య ఆరోగ్యశాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు రేవంత్ సర్కారు శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యుల వేతనాలు భారీగా పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.
చెరువులో నీరుంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. ఆయకట్టు సాగవుతుంది. పశు పక్షాదులకు తాగునీరు అందుతుంది. చెరువు చుట్టుపక్కల ప్రాంతాలు కళకళలాడుతాయి. చెరువులో నీరుంటే.. ఇంట్లో సంపద ఉన్నట్లే..! జిల్లాలో విజయనగర రాజుల కాలంలో నిర్మితమైన చెరువులు వందల సంఖ్యలో ఉన్నాయి. కానీ అవన్నీ ప్రాభవం కోల్పోతున్నాయి. నీరొచ్చే మార్గాలతోపాటు చెరువుల ఆక్రమణలు పెరిగిపోయాయి. దీనికి పాలకులు, అధికారుల నిర్లక్ష్యం తోడైంది. ఫలితంగా చెరువులు ముళ్ల పొదలతో ...
నగరంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం ప్రజా దర్బారు నిర్వహించారు. వివిధ వర్గాల ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు. సమస్యలను తెలిపేందుకు వచ్చిన నాయకులు, ప్రజలతో ఆయన నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. అక్కడికక్కడే పరిష్కరించలేని సమస్యలను సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేశారు. సుమారు రెండు..
ఎన్నికల నేపథ్యంలో ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన తహసీల్దార్లు అందరూ జిల్లాకు తిరిగొచ్చారు. జిల్లా నుంచి మొత్తం 39 మంది రాయలసీమలోని ఇతర జిల్లాలకు వెళ్లగా.. అందరూ అక్కడి నుంచి రిలీవ్ అయ్యారు. వారిలో ఇద్దరు శ్రీసత్యసాయి జిల్లాకు వెళ్లినట్లు సమాచారం. మరో ఇద్దరు రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్నారని తెలిసింది. మిగిలిన 35 మందిలో 31 మందిని జిల్లాలోని మండలాలకు కేటాయిస్తారు. నలుగురిని కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాలకు కేటాయిస్తారు. పొరుగు జిల్లాల నుంచి తిరిగొచ్చిన తహసీల్దార్లు ...
నిన్న మొన్నటి దాకా ఓ రేంజ్‌లో రైతులకు లాభాలు కురిపించిన టమోటా ప్రస్తుతం నేల చూపులు చూస్తోంది. మొన్నటి వరకు అనంతపురం, కర్ణాటకలోని కోలార్ మార్కెట్‌లో 16 కేజీల టామోటా బాక్స్ రూ.900లు పలికింది. అది ప్రస్తుతం రూ. 300లకు పడిపోయింది. ఈ ధరలు ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. వారం రోజుల వ్యవధిలోనే ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నియోజక వర్గంలోని కంబదూరు, కుందుర్పి, శెట్టూరు, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం రూరల్ ...