• Home » Districts

Districts

 SMC elections : ప్రశాంతంగా ఎస్‌ఎంసీ ఎన్నికలు

SMC elections : ప్రశాంతంగా ఎస్‌ఎంసీ ఎన్నికలు

పాఠశాల మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఎ్‌సఎంసీ) ఎన్నికలు జిల్లావ్యాప్తంగా గురువారం సజావుగా సాగాయి. మొత్తం 1,741 పాఠశాలల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లుచేశారు. ఇందులో కోరం లేని కారణంగా 29 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. 971 స్కూళ్లలో కమిటీలు ఏకగీవ్రం అయ్యాయి. 741 పాఠశాలల్లో ఎన్నికల ద్వారా కమిటీలను ఏర్పాటు చేశారు. వాయిదా పడిన చోట్ల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని ఏపీసీ నాగరాజు తెలిపారు. ఎన్నికల పాఠశాలల ఆవరణలు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాశాఖ, సమగ్రశిక్ష ...

 Shinganamala pond : మరువ కష్టాలు

Shinganamala pond : మరువ కష్టాలు

శింగనమలలోని శ్రీరంగరాయల చెరువు నిండి మరువ పారితే ఉధృతి తగ్గేవరకూ 40 నుంచి 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. ఈ సమస్య పరిష్కారానికి మరువ వద్ద బ్రిడ్జి నిర్మించాలన్న ప్రతిపాదన కొన్నేళ్ల నుంచి ఉంది. బ్రిడ్జి నిర్మిస్తామని వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త, అప్పటి ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి హామీ ఇచ్చారు. కానీ నిలబెట్టుకోలేదు. దీంతో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ...

Drugs : జైలుకు పంపిన జల్సాలు

Drugs : జైలుకు పంపిన జల్సాలు

పద్ధతిగా సేద్యం చేసుకుంటూ, పాలు అమ్ముకుంటూ బతికేవారు. జల్సాలకు ఆ సొమ్ము సరిపోలేదని మొదట కర్ణాటక మద్యం అమ్మారు. ఆ తరువా గంజాయి వ్యాపారంలోకి దిగారు. పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. పామిడి పోలీసు స్టేషనలో సీఐ రాజశేఖర్‌రెడ్డి ఈ వివరాలను బుధవారం వెల్లడించారు. పామిడి మండలంలోని పాళ్యం గ్రామానికి చెందిన అన్నదమ్ములు తమ్మినేని శివకుమార్‌, తమ్మినేని నందకుమార్‌ పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవారు. ఆవులను పెంచుతూ పాలను అమ్మేవారు. వీటి ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు, జల్సాలకు ...

 Topudurthi batch : రూ.6.50 కోట్లు దోచిన తోపుదుర్తి బ్యాచ

Topudurthi batch : రూ.6.50 కోట్లు దోచిన తోపుదుర్తి బ్యాచ

నసనకోట ముత్యాలమ్మ ఆలయంలో గడిచిన ఐదేళ్లలో రూ.6.50 కోట్ల దోపిడీ జరిగిందని నసనకోట పంచాయతీ ప్రజలు ఆరోపించారు. ఆలయ ఆవరణలోని గదులు, వ్యాపార అనుమతులకు బుధవారం నిర్వహించిన వేలంపాటలో రూ.89.65 లక్షల ఆదాయం వచ్చిందని, దీని ప్రకారం లెక్కవేస్తే దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థమౌతుందని అన్నారు. దోపిడీ వెనుక అప్పటి ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డి బ్యాచ ఉందని ఆరోపించారు. ఆలయ కమిటీ మాజీ సభ్యులు రామ్మూర్తినాయుడు, ఈఓ వెంకటేశ్వర్లు, దేవదాయశాఖ జిల్లా ఇనస్పెక్టర్‌, పోలీసు ...

Srivari kalayanam : శ్రీనివాస కల్యాణం

Srivari kalayanam : శ్రీనివాస కల్యాణం

అనంతపురం నగరంలోని పాతూరు వాసవీ కన్యకాపరమేశ్వరి కల్యాణ మండపంలో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం బుధవారం కన్నుల పండువగా సాగింది. వాసవీ మహిళా మండలి ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులకు అష్టోత్తర కలశాభిషేకం, తోమాల సేవ నిర్వహించారు. అనంతరం అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ సేవ ..

YCP: రూ.9 కోట్లు రోడ్లపాలు

YCP: రూ.9 కోట్లు రోడ్లపాలు

ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఐదేళ్లపాటు ఏమీ చేసింది లేదు. ఎన్నికల ప్రచారానికి వెళితే.. ఏదో ఒకటి చెప్పాలి. మాయ చేసి గెలవాలి. ఇలా ఆలోచించారు అప్పటి మంత్రి ఉష శ్రీచరణ్‌. అవినీతి ఆరోపణలు, సొంత పార్టీ నాయకుల తిరుగుబాటుతో అప్పటికే పీకల్లోతు కూరుకుపోయిన ఆమె.. తనకు టిక్కెట్‌ కళ్యాణదుర్గంలోనే వస్తుందని అనుకున్నారు. ఎలాగోలా గెలిచేద్దామని అనుకున్నారు. అందుకే.. ప్రచారాస్త్రంగా పనికి వస్తుందని పట్టణంలో రహదారి పనులను ఆగమేఘాల మీద చేపట్టారు. ...

Farmers : రైతులను మింగుతున్న అప్పులు

Farmers : రైతులను మింగుతున్న అప్పులు

అన్నదాతల బలవన్మరణాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఏ పంట పెట్టినా నష్టాలు వెంటాడుతుండటంతో దిక్కుతోచక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అప్పులు తీర్చేమార్గం లేక అర్ధంతరంగా వెళ్లిపోతున్నారు. జిల్లాలో మంగళవారం ఇద్దరు రైతులు ఉరి వేసుకోవం రైతాంగ సంక్షోభానికి అద్దం పడుతోంది. కంబదూరు మండ లం రాళ్ల అనంతపురం గ్రామానికి చెందిన దండా సురేష్‌(30), రాయదుర్గం మండలం టి.వీరాపురం గ్రామానికి చెందిన రైతు ఓబన్న(41) తోట పంటలను సాగుచేసి తీవ్రంగా నష్టపోయారు. లక్షలాది రూపాయల అప్పులు ...

PARITALA SUNITA : అహుడా నిబంధనలను అమలు చేయండి

PARITALA SUNITA : అహుడా నిబంధనలను అమలు చేయండి

అహుడా పరిధిలో ఇళ్ల స్థలాల లే అవుట్లు, ఇతర విషయాల్లో నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆమె అహుడా అధికారులతో సమావేశం నిర్వహించారు. రియల్టర్లు నిబంధనలను పాటిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేయకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లేదంటే ప్రజలు నష్టపోతారని అన్నారు. రాప్తాడు పరిధిలో పెండింగ్‌ ఫైల్స్‌ని వెంటనే క్లియర్‌ ...

Banner story : ఎటుపోతోంది సమాజం?

Banner story : ఎటుపోతోంది సమాజం?

ఎటుపోతోంది సమాజం? ఉచ్చ, నీచాలు, వావివరుసలు లేని పాతరాతి యుగంలా రగులుతోందా? ఆదిశక్తిని కొలిచే ఈ సమాజమే ఆడబిడ్డను ఆటబొమ్మగా చూస్తోందా? బేటీ అంటే ఇంటికి బ్యూటీ అంటారు కదా..! మరి ఆ అందాన్ని ఆరాధిస్తున్నారా లేక అంతులేని కామ వాంఛతో చిదిమేస్తున్నారా? భగవంతుడిచ్చిన అవయవముంటే చాలు పడుచు పిల్ల , పండు ముసలి అన్న తేడా లేదు. పాలుగారే పసిపాప అయినా పర్వాలేదు. ...

Works.. Money : ఉన్నంతలో దోచేద్దాం !

Works.. Money : ఉన్నంతలో దోచేద్దాం !

కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఒక్కరంటే ఒక్కరు తమ పని పెండింగ్‌లో ఉంద ని అడిగే వారే లేడు. దీనికి మామూళ్లే ప్రధాన కారణం. ఎందుకంటే ఇక్కడ పనిని బట్టి మామూళ్ల వసూలు చేస్తున్నారు. ఈ తతంగమంతా పుట్లూరు మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సాగుతోంది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎక్కడినుంచో అధికారులు బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం అధికారులను తమతమ స్థానాలకు ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి