• Home » Districts

Districts

 Anjaneyaswami : పవనపుత్రా! పాహిమాం

Anjaneyaswami : పవనపుత్రా! పాహిమాం

జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కసాపురం, నేమకల్లు, మురడి ఆంజనేయస్వామి ఆలయాల్లో మంగళవారం విశేష పూజలు జరిగాయి. ప్రతి ఏటా శ్రావణమాసంలో శని లేదా మంగళవారం ఒకే రోజు ఈ మూడు ఆలయాలను దర్శించుకోవడం భక్తులకు పరిపాటి. ఈ క్రమంలో ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం, నిర్మల్య విసర్జన, విష్ణు పారాయణం, అష్టోత్తర పూజలు ..

E-Panta  Problems : అన్నీ కష్టాలే

E-Panta Problems : అన్నీ కష్టాలే

జిల్లాలో ఈ పంట నమోదుకు సర్వర్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. ఈనెల 3 నుంచి ఖరీఫ్‌లో సాగైన పంటల నమోదు ప్రక్రియ మొదలైంది. తొలి రోజు సర్వర్‌ పని చేసినా ఆ మరుసటి రోజు నుంచి సక్రమంగా పనిచేయడం లేదు. ఈ పంట నమోదు ఆధారంగానే రైతులకు పంట నష్టపరిహారం, పంటల బీమా, ఇతర రకాల పథకాలు వర్తింపజేస్తున్నారు.

 Tungabhadra Dam : ఆశలు ఢాం!

Tungabhadra Dam : ఆశలు ఢాం!

ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నీటి ప్రాజెక్టుగా ఉన్న తుంగభద్ర జలాశయం (టీబీ డ్యామ్‌) ప్రమాదంలో పడింది. డ్యామ్‌కి అమర్చిన 19వ క్రస్ట్‌గేట్‌ చైన లింక్‌ తెగిపోయి, శనివారం రాత్రి కొట్టుకుపోయింది. దీంతో డ్యామ్‌లోని నీటిని నదికి వదిలేస్తున్నారు. సుమారు 65 టీఎంసీల మేర నీరు నదికి విడుదల చేయనున్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి ఓఆర్‌కే రెడ్డి, ఎస్‌ఈ శ్రీకాంతరెడ్డి తెలిపారు. డ్యామ్‌లో నీటి నిల్వ 40 టీఎంసీలకు తగ్గితేనే కొత్త క్రస్ట్‌గేట్‌ అమర్చడానికి అవకాశం ఉంటుందని బోర్డు ఇంజనీర్లు తెలిపారు. డ్యామ్‌కి మొత్తం ...

Kalyanotsav : ఇలలో ఇలవేల్పు పెళ్లి

Kalyanotsav : ఇలలో ఇలవేల్పు పెళ్లి

లోక కల్యాణార్థం ఆదివారం పాతూరు దత్తాత్రేయ మందిరంలో శ్రీనివాసుడి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను ...

DPO OFFICE : ఉద్యోగోన్నతి ఉండదా..!

DPO OFFICE : ఉద్యోగోన్నతి ఉండదా..!

జిల్లాలో గ్రేడ్‌-4 పంచాయతీ సెక్రటరీలుగా పని చేస్తున్న వారు అర్హత ఉన్నా ఉద్యోగోన్నతికి నోచుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యం వారిపాలిట శాపంగా మారింది. జిల్లాలోని 31 మండలాల్లో గ్రేడ్‌-4 పంచాయతీ సెక్రటరీలుగా 497 మంది పనిచేస్తున్నారు. వీరికి 2016కు ముందు సీనియార్టీ జాబితా తయారుచేసి ఉద్యోగోన్నతులు కల్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ సీనియార్టీ జాబితా తయారు చేయని కారణంగా అర్హత ఉన్నా ఉద్యోగోన్నతికి నోచుకోలేదు. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌లో పలువురు కొత్తగా గ్రేడ్‌-4 పంచాయితీ సెక్రటరీలుగా ఎంపికయ్యారు. కానీ పాతవారికి మాత్రం ఎనిమిదేళ్లుగా ఉద్యోగోన్నతి కల్పించడంలేదు....

 Mortuary : శవాల నరకం

Mortuary : శవాల నరకం

జిల్లా ఆస్పత్రిలో కొందరు శవాలపై పేలాలు ఏరుకుంటున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఆస్పత్రి కంటే నరకమే నయమనేలా కొందరి తీరు ఉన్నట్లు బాధితులు వాపోతున్నారు. అసలే తమ మనిషి చచ్చిపోవడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని సైతం కాసుల కోసం పీడిస్తున్నారు. డబ్బులిస్తేనే పోస్టుమార్టం చేస్తామంటూ వేధిస్తున్నారు. ఇవ్వకపోతే గంటలతరబడి నిరీక్షించాల్సిందేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా తెలిసినా...

Sravana month : జైహనుమాన

Sravana month : జైహనుమాన

శ్రావణ మాసం తొలి శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కసాపురం, నేమకల్లు, మురడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువ జామునే స్వామి వారి మూల విరాట్టుకు అభిషేకాలు చేశారు. ఆభరణాలు, పుష్పాలతో అలంకరిచి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు ఆలయాల్లో హనుమానాచాలీసా, సుందరకాండ పారాయణం చేశారు. కసాపురంలో సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహా లను అలంకరించి శేష వాహనంపై ..

Jagananna House : ఇంటికో వ్యథ

Jagananna House : ఇంటికో వ్యథ

మండలకేంద్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన జగనన్న హౌసింగ్‌ ఇళ్ల నిర్మాణం అంతులేని కథలాగా తయారైంది. 50మంది లబ్ధిదారులతో ఒక్కొక్కరితో రూ.35వేలు అదనంగా కట్టించుకున్న కాంట్రాక్టర్‌, అధికారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా చేతులెత్తేశారు. ఆరునెలల నుంచి కాంట్రాక్టర్‌ జాడ లేకుండా పోవడంతో హౌసింగ్‌ లబ్ధిదారుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇళ్లను తామే కట్టించి ఇస్తామని ప్రభుత్వం 3వ ఆప్షన ఇవ్వడంతో 120మంది లబ్ధిదారులు దీన్ని ఎంచుకున్నారు. అయితే ఇళ్ల ...

 Minister Payyavula Keshav : కేశవ్‌కు అరుదైన గౌరవం

Minister Payyavula Keshav : కేశవ్‌కు అరుదైన గౌరవం

జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఈ నెల 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవాలలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. జిల్లాలవారీగా జాతీయ జెండాను ఆవిష్కరించే మంత్రుల జాబితాను సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేష్‌ కుమార్‌ శుక్రవారం విడుదల చేశారు. జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న పయ్యావుల కేశవ్‌కు అరుదైన...

బాగు చెయ్యండి ప్లీజ్‌..!

బాగు చెయ్యండి ప్లీజ్‌..!

చూస్తున్నారు కదా..? ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో..! యాడికి నుంచి బుగ్గకు వెళ్లే రోడ్డు, రాయలచెరువు నుంచి చందనకు, అక్కడి నుంచి దైవాలమడుగు వరకూ వెళ్లే రోడ్డు, యాడికి నుంచి రాయలచెరువుకు వెళ్లే రోడ్డు, తూట్రాళ్లపల్లి నుంచి నగరూరుకు వెళ్లే రోడ్డు.. ఏ దారి చూసినా గుంతలమయమే. వర్షాలు కురవగానే చిన్నపాటి నీటి మడుగులుగా మారుతాయి. ఆ తరువాత బురదగుంతలుగా తయారౌతాయి. ఎండకాచి ఆరిపోయిన తరువాత.. దుమ్ము రేగుతాయి. ఇలా ఒకదాని తరువాత ఒక ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి