• Home » District

District

POLITICAL : కదులుతున్న కుర్చీలు

POLITICAL : కదులుతున్న కుర్చీలు

టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ నేతృత్వం వహిస్తున్న స్థానిక సంస్థల పీఠాలు కదులుతున్నాయి. ఎంపీపీ, మున్సిపల్‌ చైర్మన పదవుల్లో ఉన్న వైసీపీ నాయకులు.. అసమ్మతిని ఎదుర్కొనేందుకు తంటాలు పడుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా తమ పనులు జరగకపోవడం, నిధులు, బిల్లుల విషయంలో వివక్ష చూపడంతో వైసీపీకి చెందిన కొందరు రగిలిపోతున్నారు. ఎంపీటీసీలు, కౌన్సిలర్లలో కొందరు

LAND : ఓపెన సీక్రెట్‌..!

LAND : ఓపెన సీక్రెట్‌..!

ఆయనో రెవెన్యూ ఉద్యోగి. అనంతపురం అర్బన తహసీల్దారు కార్యాలయంలో పనిచేస్తుంటారు. వేతనం బాగానే ఉంటుంది. అది చాలదో ఏమో.. తన ఇంటి వద్ద లే అవుట్‌లో ప్రజల అవసరాలకు వదిలిన స్థలాన్ని ఆక్రమించాడు. ఇతరులకు అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ వ్యవహారం కొన్నేళ్లుగా సాగుతోంది. ఎవరూ పట్టించుకోవడం లేదు. అనంతపురం రూరల్‌ మండలంలో ఈ తతంగం సాగుతోంది. కురుగుంట గ్రామ పొలం సర్వే నంబర్లు 104-2బి, 105-2ఎ, 2బిలో 4.67 ఎకరాలు భూమి ఉంది. కొన్నేళ్ల కిందట ఆ భూమిలో ప్రస్తుతం అనంతపురం అర్బన తహసీల్దార్‌ కార్యాలయంలో...

దూకేద్దాం !

దూకేద్దాం !

సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘనవిజయంతో క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈక్రమంలోనే కొందరు ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. ఇదే వరుసలో గుంతకల్లు వైసీపీ కౌన్సిలర్లు ఉన్నారు. ఎన్నికల ఫలితాలను ముందుగానే పసిగట్టిన నలుగురు కౌన్సిలర్లు గుమ్మనూరు జయరాంకు టిక్కెట్టు ఇచ్చిన వెంటనే టీడీపీలో చేరారు. ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో వైసీపీ కౌన్సిలర్లలో అంతర్మథనం ప్రారంభమైంది. వైసీపీ హయాంలో వార్డుల్లో ...

HOSPITAL : డబ్బు రోగం!

HOSPITAL : డబ్బు రోగం!

అనంత పురం రూరల్‌ పరిధిలో నివాసం ఉంటున్న ఓ టీచర్‌ కుమారుడు జ్వరంతో బాధపడుతుండగా సాయినగర్‌లోని ఓప్రైవేటు ఆస్పత్రికి మూడు రోజుల కిందట తీసుకొచ్చారు. ఇక్కడ ఆ అబ్బాయిని పరీక్షించిన డాక్టర్‌ ఇది డెంగీ ఫీవర్‌లా ఉంది. ప్లేట్‌లెట్స్‌ తగ్గాయి. ఇక్కడే అడ్మిషన చేయాల్సి ఉంటుందని చెప్పడంతో ఆ టీచర్‌ ఆందోళనతో డాక్టర్‌ చెప్పినట్లు చేశాడు. ప్రతి రోజూ సగటున రూ.12వేలు వరకు ఫీజు వేస్తూ వస్తున్నారు. ఇప్పటికే రూ. 36వేలు వరకు బిల్లు ...

FOREST DEPT : పదేళ్ల పనిమంతుడు..!

FOREST DEPT : పదేళ్ల పనిమంతుడు..!

అటవీశాఖ జిల్లా కార్యాలయంలో పదేళ్లుగా ఓ అధికారి పాతుకుపోయారు. ఓ కాంట్రాక్ట్‌ ఉద్యోగి అండతో వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్‌ చేసి మరీ దందా నడిపిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ముడుపు కడితేగానీ ఫైల్‌ ముందుకు కదలదని, చెదలు పట్టినా అలాగే ఉండిపోతుందని విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగోన్నతులు, ఇంక్రిమెంట్లు.. ఇలా ఏదైనా సరే.. ఆయనకు ఇవ్వాల్సింది ఇచ్చేయాల్సిందేనట. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక బాధితులు లబోదిబోమంటున్నారు. ఉన్నతాధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ...

WELFARE ASSISTANT : పింఛన్ల సొమ్ము స్వాహా

WELFARE ASSISTANT : పింఛన్ల సొమ్ము స్వాహా

శెట్టూరు మండల కేంద్రంలోని సచివాలయంలో పనిచేసే వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ మల్లికార్జున పింఛన్ల సొమ్ము పంపిణీ చేయకుండా చేతివాటం ప్రదర్శించాడు. లబ్ధిదారులతో సోమవారం వేలిముద్రలు వేయించుకుని.. సొమ్ము ఇవ్వకుండా వెళ్లిపోయాడు. మొత్తం రూ.8 లక్షల వరకూ కాజేశాడని బాధితులు ఎంపీడీఓ నరసింహమూర్తికి మంగళవారం ఫిర్యాదు చేశారు. దీంతో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌పై స్థానిక పోలీస్‌ స్టేషనలో ఎంపీడీఓ ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. టీడీపీ కూటమి మంజూరు ...

MINISTERS : పరిటాల రవి.. ఓ నిప్పు కణిక

MINISTERS : పరిటాల రవి.. ఓ నిప్పు కణిక

దివంగత పరిటాల రవీంద్ర ఒక నిప్పుకణిక అని, ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని రాష్ట్ర మంత్రులు సత్యకుమార్‌ యాదవ్‌, సవిత పేర్కొన్నారు. మండలంలోని వెంకటాపురానికి మంగళవారం వారు విచ్చేశారు. వారికి ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌, కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారంతా గ్రామంలోని యల్లమ్మ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పరిటాల రవి ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. అక్కడ పరిటాల రవి జీవితంలోని ముఖ్య ఘట్టాలతో ...

PINCHAN : పేదింటి పండుగ

PINCHAN : పేదింటి పండుగ

జిల్లాలో సోమవారం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణాన్ని తలపించింది. పెంచిన పింఛన అందుకున్న లబ్ధిదారుల ఇళ్లలో జయహో చంద్రన్న నినాదం మార్మోగింది. చంద్రబాబు పేదింటి పెద్ద కొడుకయ్యాడంటూ లబ్ధిదారుల నుంచి దీవెనలు వెల్లువెత్తాయి. చేతిలోకి ఒక్కసారిగా పింఛన రూపంలో రూ. ఏడు వేలు రాగానే అవ్వతాతల మోములు మతాబుళ్లా వెలిగిపోయాయి. కొందరు ఆనందంతో డ్యాన్సులు వేశారు. కొన్ని చోట్ల కేకులు కట్‌ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ..

AMMA DAIRY : అమ్మమ్మా!

AMMA DAIRY : అమ్మమ్మా!

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఏర్పాటు చేసిన అమ్మ డెయిరీ బకాయిలు రూ. రెండు కోట్లకు చేరాయి. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో పాడి రైతుల నుంచి ఏజెంట్లు పాలు సేకరించి అమ్మ డెయిరీకి సరఫరా చేస్తున్నారు. గత కొన్ని నెలల నుంచి ఏజెంట్లకు ఒక్కొక్కరికి అమ్మ డెయిరీ రూ.లక్షల్లో బాకీ పడుతూ వస్తోంది. ఏజెంట్లు మాత్రం అప్పులు చేసి గ్రామాల్లో రైతులకు బిల్లులు ...

POLICE : 13 మంది పోలీసులు రిటైర్డ్‌

POLICE : 13 మంది పోలీసులు రిటైర్డ్‌

జిల్లాలో ఒక డీఎస్పీ, ఆరుగురు ఎస్‌ఐలతో కలిపి మొత్తం 13మంది పోలీసులు సోమవారం ఉద్యోగ విరమణ చేశారు. పోలీస్‌ కాన్ఫరెన్స హాల్‌లో ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ గౌతమిశాలి సన్మానం చేశారు. రిటైరైన వారిలో డీఎస్పీ ఆంథోనప్ప, ఎస్‌ఐలు రఫిక్‌సాహెబ్‌, బలరామరావు, తిప్పయ్యనాయక్‌, వెంకట లక్ష్మమ్మ, చంద్రశేఖర్‌, సులోచన, ఏఎ్‌సఐలు పద్మావతి, ఎర్రిస్వామి, దేవదాస్‌, మారెప్ప, ఎండీ దావూద్‌, హెడ్‌కానిస్టేబుల్‌ అల్లీపీరా సాహెబ్‌ ఉన్నారు. ఈ సందర్భంగా రిటైరైన పోలీసుల ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి