Home » Dharani
ధరణి పెండింగ్ దరఖాస్తులను 15 రోజుల్లోగా పరిష్కరించాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. ధరణిపై ఆయన శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా పెండింగులో ఉన్న దరఖాస్తులను సమీక్షించారు.
అనుమతులు లేని లేఅవుట్లలో గజాల్లో రిజిస్ట్రేషన్ అయిన స్థలాలకు సంబంధించిన నాలా చార్జీలపై పీటముడి వీడడం లేదు. ఆయా స్థలాలను కొనుగోలు చేసిన వారు నాలా చార్జీలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ధరణి పెండింగ్ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏ నవీన్‌మిత్తల్ ఆదేశించారు. 10 రోజుల్లో పెండింగ్ దరఖాస్తులన్ని పరిశీలించి జీరో స్టేజికి తీసుకురావాలని గడువు విధించారు. శుక్రవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు
హైదరాబాద్ నగరంలో శాసనసభ ఎన్నికల ముందు వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు రికార్డుల్లో ప్రయువేటు వ్యక్తుల పరమైనట్లు తెలుస్తోంది. రంగారెడ్డి కలెక్టరేట్ కేంద్రంగా ఈ వ్యవహారం జరిగింది. కలెక్టరేట్‌లోని ధరణి ఆపరేటర్లను ఆకట్టుకొని, కోట్ల రూపాయలు ముట్టజెప్పి రియల్టర్లు ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములను ప్రయివేటు వ్యక్తుల పేర రాయించినట్లు ఆర్థిక నేరాల విభాగం పోలీసుల దర్యాప్తులో బయటకు వస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ధరణి భూబాగోతాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. ధరణిలోని లొసుగులను అడ్డుపెట్టుకుని నగర శివార్లలో నకిలీ పత్రాలతో దాదాపు రూ.500 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కాజేసిన వ్యవహారం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. అఽధికారులు, బడా నేతల ఆశీస్సులతో విలువైన ప్రభుత్వ భూములకు ఓ రాజకీయ నాయకుడి కుమారుడి పేరు మీద పట్టాదారు పాస్‌బుక్‌లు పొందారు.
ధరణి పోర్టల్‌లో పెండింగ్ దరఖాస్తులపై ధరణి కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది. ధరణి స్పెషల్ డ్రైవ్‌లో గుర్తించిన 2.45 లక్షల దరఖాస్తుల పరిష్కారానికి జూన్ 4వరకు గడువు విధించింది. ఇప్పటి వరకు గుర్తించిన 119 తప్పులను సరిదిద్దేందుకు ధరణి పోర్టల్‌లో కొత్తగా మరో 76 మాడ్యూల్స్ తీసుకురావాలని కమిటీ సిఫార్సు చేసింది. శనివారం సచివాలయంలో ధరణి కమిటీ కన్వీనర్, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ అధ్యక్షతన సభ్యులు మాజీ సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్, కోదండరెడ్డి, మధుసూదన్, భూ చట్టాల నిపుణులు సునీల్, సీఎంఆర్వో ప్రాజెక్టు డైరెక్టర్ వి.లచ్చిరెడ్డి ప్రత్యేక సమావేశం అయ్యారు.
ధరణి పోర్టల్ వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఆ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ధరణి కమిటీని ఏర్పాటు చేసింది. సమస్యలపై కమిటీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ధరణిలో మొత్తం 119 తప్పలు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించింది. స్పెషల్ డ్రైవ్ చేపట్టిన తర్వాత 76 తప్పులను పరిష్కరించాల్సి ఉందని ధరణి కమిటీ పేర్కొంది.
ధరణిలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది బాధితులు ఎదురు చూస్తున్నారు. ధరణి దరఖాస్తులకు సంబంధించిన అంతర్గత పరిశీలన పూర్తయినప్పటికీ, ఇంకా పెండింగ్‌లోనే ఉంచారు. ఈ ప్రక్రియను రెవెన్యూ అధికారులు ఎప్పుడు చేపడుతారోనన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది.
బొమ్మరాశి పేటలో కొందరు రికార్డ్స్ ట్యాంపరింగ్ చేసి భూములను కాజేశారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు (Gone Prakash Rao) ఆరోపించారు. బొమ్మరాశి పేట, శామీర్ పేట మండలంలో 920 ఎకరాల భూముల కుంభకోణం జరిగిందని చెప్పారు. బొమ్మరాశి పేటలో బీఆర్ఎస్ నేతలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంతోష్, మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో పాటు మరి కొంతమంది భూములు ఉన్నాయన్నారు.
తెలంగాణలో ధరణి సమస్యల పరిష్కారానికి రేవంత్ ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఈ మేరకు కలెక్టర్లకు సీసీఎల్ఏ మార్గదర్శకాలు సూచించింది. మార్చి ఒకటి నుంచి మార్చి 9 వరకు ధరణి సమస్యలను పరిష్కారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.