Home » DGP Jitender
‘‘తెలంగాణలో డ్రగ్స్ అమ్మాలన్నా.. కొనాలన్నా భయపడేలా.. పట్టుబడితే శిక్ష తప్పదనేలా చర్యలు తీసుకుంటున్నాం. డ్రగ్స్ రహితంగా.. మత్తుమందు దొరకని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నాం’’ అని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు.
BRS Leader Harish Rao: తెలంగాణలోని పోలీస్ శాఖలో కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకు వరుసగా ఆత్మహత్యలు చోటు చేసుకోంటున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇకపై సినిమా బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని.. అసెంబ్లీలో ఈమేరకు తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పెద్దలకు తేల్చిచెప్పారు.
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సంద ర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, మహిళ మృతిపై ఎవరి వాదనలు వారు చెబుతున్నారు.
డీజీపీ జితేందర్ వ్యక్తిగత సెలవుల్లో విదేశాలకు వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో ఇన్‌చార్జి డీజీపీగా హోంశాఖ కార్యదర్శి రవిగుప్తాకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.
గోషామహల్ పోలీస్ స్టేడియాన్ని మలక్‌పేటలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
పోలీసులు విధి నిర్వహణలో అంకిత భావంతో పని చెయ్యాలని, పోలీసింగ్ ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. బాధతో పోలీసు స్టేషన్‌కు వచ్చే వారికి భరోసా ఇచ్చేలా విధి నిర్వహణలో ఉండాలని శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లకు ఆయన సూచించారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ జితేందర్ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద తనిఖీలకు ప్రత్యేక బృందాలు మోహరిస్తున్నట్లు వెల్లడించారు.
Telangana: గ్రూప్ 1 పరీక్షల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని డీజీపీ జితేందర్ తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్ల మీదికి వచ్చి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకోమని స్పష్టం చేశారు.
విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ, తప్పులు సరిదిద్దుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించాలని అధికారులు, సిబ్బందికి డీజీపీ జితేందర్ సూచించారు.