Home » Delhi liquor scam
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ లీగల్ టీమ్ ఘాటుగా స్పందించింది. తమ పార్టీ నాయకుడికి వ్యతిరేకంగా..
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊరట..! మద్యం కుంభకోణం కేసులో సరిగ్గా 3 నెలల కింద అరెస్టయిన ఆయనకు ఎట్టకేలకు రెగ్యులర్ బెయిల్ లభించింది.
ఢిల్లీ హైకోర్టులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే..
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్ర, అందుకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను దాఖలు చేసినట్టు సీబీఐ శుక్రవారం రౌస్‌అవెన్యూ కోర్టుకు తెలిపింది. దానిని పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది.
ఢిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్ కస్డడీ కోరుతూ నేడు( శుక్రవారం) సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. దీంతో మరోసారి కవితకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. జూన్ 21 వరకు రౌస్ అవెన్యూ కోర్టు కవితకు కస్డడీని పొడిగించింది.
ఢిల్లీ లిక్కర్ కేసు(Delhi Liquor Case)లో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్(ED Charge Sheet)లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పాత్రపై మే 10న పీఎంఎల్ఏ 44, 45సెక్షన్ల కింద సప్లిమెంటరీ ఛార్జ్ షీట్‌ను ఈడీ దాఖలు చేసింది. తాజాగా దీన్ని స్పెషల్ కోర్టు పరిగణలోకి తీసుకోవడంతో పలు అంశాలు బహిర్గతం అయ్యాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Case) నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రిమాండ్ ముగియడంతో నేడు (సోమవారం) తీహార్ జైలు అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సోమవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. జ్యుడీషియల్ కస్టడీ ముగియనుండడంతో ఆమెను కోర్టు ఎదుట హాజరు పరచనున్నారు. కవితతోపాటు చరణ్‌ప్రీత్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్‌లను నిందితులుగా పేర్కొంటూ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌ను గత నెల 29న న్యాయమూర్తి అంగీకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఆదివారం మళ్లీ తిహాడ్ జైలుకు వెళ్లారు. జైలుకు వెళ్లడానికి ముందు తన నివాసంలో తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.