Home » delhi liquor scam case
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను కష్టాలు వీడటంలేదు. అరెస్టై నాలుగు నెలలు గడుస్తున్నా కవితకు ఈకేసులో బెయిల్ లభించలేదు. దీంతో బెయిల్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్న ఎమ్మెల్సీ కవిత.. ప్రస్తుతం డిఫాల్ట్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యూడీషియల్ కస్టడీని ఈ నెల 18 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.
ఫిరాయింపులకు పాల్పడ్డ ప్రజా ప్రతినిధులను డిస్‌క్వాలిఫై చేయాలని రాహుల్ గాంధీ, పార్టీలు మారే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని ఇదే సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు అన్నారని కానీ, ఇప్పుడు తమ ఎమ్మెల్యేలను కాంగ్రె్‌సలోకి ఎలా చేర్చుకుంటున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) జైలు శిక్ష అనుభవిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ ఆశలపై ఢిల్లీ హైకోర్టు నీళ్లు చల్లింది. ఆమె బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారించిన ధర్మాసనం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
మూడు నెలలుగా తీహార్ జైలులో ఉన్న కవిత బెయిల్ పిటిషన్‌పై ఈరోజు ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అవకతవకలు జరిగాయని సీబీఐ , ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసులో ప్రస్తుతం కవిత అరెస్ట్ అయ్యారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై సోమవారం (జూలై 1) ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశముంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు 3 రోజుల సీబీఐ కస్టడీ శనివారం పూర్తయింది. కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు.. కేజ్రీవాల్‌ను(Arvind Kejriwal) కోర్టులో హాజరు పరిచారు.
ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను మూడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆప్ కన్వీనర్, సీఎం కేజ్రీవాల్‌కు(CM Arvind Kejriwal) ఊరట దక్కలేని విషయం విదితమే. కేజ్రీవాల్ పిటిషన్‌ను జూన్ 26వ తేదీన విచారిస్తామని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్‌తో కూడిన వెకేషన్ బెంచ్ సోమవారం వెల్లడించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురయింది. ఆయన బెయిల్‌పై ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించలేదు.