Home » Delhi High Court
ఈరోజుల్లో చాలామంది మహిళలు సెపరేట్ కాపురం కావాలని కోరుకుంటున్నారు. అత్తమామలతో కలిసి ఉండటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. వాళ్లు తల్లిదండ్రుల్లాగా బాగా చూసుకున్నా సరే.. వేరే కాపురం పెట్టాల్సిందేనని...
ఢిల్లీ హైకోర్టులో ఏపీ వలంటీర్ల కేసు విచారణ జరిగింది. వలంటీర్లకు పేపర్ కొనుగోలు కోసం నెలకు రూ.200 ఇస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఉషోదయ పబ్లికేషన్స్ సవాలు చేసింది.
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) బొగ్గు గనుల కేటాయింపుల కుంభకోణం కేసులో రాజ్యసభ మాజీ ఎంపీ విజయ్ దర్దా, ఆయన కుమారుడు దేవేందర్ దర్దా, వ్యాపారవేత్త మనోజ్‌కుమార్ జైస్వాల్(Manoj Kumar Jaiswal)కు ఢిల్లీ కోర్టు(Court of Delhi) బుధవారం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.
ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క మాయమవడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌరాంగ్ కాంత్‌కు ఆవేదన కట్టలు తెంచుకుంది. అంకితభావంతో పని చేయని తన ఇంటి భద్రతా సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వెళ్లగక్కారు. ఉదాసీనంగా వ్యవహరించిన భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాశారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రఘవకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలపై మాగుంటకు నాలుగు వారాల పాటు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడు మాగుంట రాఘవ మధ్యంతర బెయిల్ రద్దు అయ్యింది. రాఘవ మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జూన్ 12న సరెండర్ కావాలని రాఘవను సుప్రీం ఆదేశించింది. మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు అయ్యింది.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆరు వారాల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన చేసుకున్న విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు తోసిపుచ్చింది. అయితే, అస్వస్థతతో చికిత్స పొందుతున్న భార్యను కలుసుకునేందుకు అనుమతి ఇచ్చింది.
ఎలాంటి రిక్విజిషన్ స్లిప్, ఐడీ ప్రూఫ్ లేకుండా రూ.2,000 నోట్లను మార్చుకోవడానికి ఆర్బీఐ, ఎస్‌బీఐ జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు కొట్టివేసింది.
రూ.2 వేల నోట్ల మార్పిడికి గుర్తింపు కార్డు అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. గుర్తింపు కార్డుల అవసరం లేకుండా రూ.2వేల నోట్లను మార్చుకోవడంపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. గుర్తింపుకార్డు, అప్లికేషన్‌లు లేకుండా ఒకేరోజు రూ.20 వేలు మార్చుకునేందుకు ఆర్‌బీఐ అనుమతించింది. గుర్తింపు కార్డు లేకపోతే నల్లధనం.. తెల్లధనం అవుతుందంటూ పిల్ దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టు ఈ పిల్‌ను కొట్టివేసింది.