• Home » Delhi Excise Policy

Delhi Excise Policy

Delhi Liquor Scam: నేడు కవిత బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

Delhi Liquor Scam: నేడు కవిత బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) బెయిల్‌ పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈరోజు (మంగళవారం) విచారణ జరగనుంది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేసింది. జస్టిస్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ముందు విచారణ చేపట్టనుంది.

Excise scam: కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

Excise scam: కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని సెప్టెంబర్ 2వ తేదీ వరకూ ఢిల్లీ కోర్టు మంగళవారంనాడు పొడిగించింది.

Delhi Lt Governor: అతిషి కాదు.. కైలాశ్ గెహ్లాట్‌కు ఛాన్స్

Delhi Lt Governor: అతిషి కాదు.. కైలాశ్ గెహ్లాట్‌కు ఛాన్స్

న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆప్ నేత, హోం మంత్రి కైలాశ్ గెహ్లాట్ పాల్గొనాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సెనా ఆదేశించారు. దీంతో చాత్రశాల్ స్టేడియంలో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కైలాశ్ గెహ్లాట్ పాల్గొని.. కేజ్రీవాల్ ప్రభుత్వం తరఫున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఈ మేరకు రాజ్ నివాస్ మంగవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Supreme Court: లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోదియాకు బెయిల్

Supreme Court: లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోదియాకు బెయిల్

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను సుప్రీం మంజూరు చేసింది.

Manish Sisodia: ‘నిజాయితీకి ప్రతీక.. అరవింద్ కేజ్రీవాల్’

Manish Sisodia: ‘నిజాయితీకి ప్రతీక.. అరవింద్ కేజ్రీవాల్’

అరవింద్ కేజ్రీవాల్ నిజాయితీకి ప్రతీక అని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు. అలాంటి ఆయన్ని దెబ్బ తీసేందుకు సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను మోదీ వినియోగించుకుంటుందని ఆరోపించారు. అందులోభాగంగానే కేంద్రంలోని మోదీ సర్కార్.. ఆప్ నేతలపై తప్పడు కేసులు నమోదు చేసి జైలుకు పంపుతుందని ఆయన మండిపడ్డారు.

Delhi excise policy scam: మనీశ్ సిసోడియాకు బెయిల్.. స్పందించిన సునీత కేజ్రీవాల్

Delhi excise policy scam: మనీశ్ సిసోడియాకు బెయిల్.. స్పందించిన సునీత కేజ్రీవాల్

న్యాయం జరగడం ఆలస్యం కావచ్చునేమో కానీ.. న్యాయం తిరస్కరించబడడం మాత్రం జరగదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో సునీత కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా పైవిధంగా స్పందించారు.

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. మళ్లీ టెన్షన్

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. మళ్లీ టెన్షన్

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం రౌస్‌ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది..

Delhi Excise policy case: కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ అభ్యర్థనపై హైకోర్టు తీర్పు రిజర్వ్

Delhi Excise policy case: కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ అభ్యర్థనపై హైకోర్టు తీర్పు రిజర్వ్

సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ పాలసీ కేసులో రెగ్యులర్ బెయిల్ కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వరాదని సీబీఐ వాదించింది.

Delhi excise case: మనీష్‌తోపాటు కవిత జ్యుడిషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు

Delhi excise case: మనీష్‌తోపాటు కవిత జ్యుడిషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు

మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవితల జ్యుడిషియల్ కస్టడీ జులై 31 వరకు ఢిల్లీ కోర్టు పొడిగించింది. తీహాడ్ జైల్లోనున్న వీరిని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ కోర్టు ఎదుట పోలీసులు హాజరు పరిచారు. ఢిల్లీ మద్యం కేసులో అవినీతి ఆరోపణల నేపథ్యంలో వీరిని సీబీఐ అరెస్ట్ చేసింది.

Arvind Kejriwal: సీబీఐ అరెస్టుపై కేజ్రీ పిటిషన్‌.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

Arvind Kejriwal: సీబీఐ అరెస్టుపై కేజ్రీ పిటిషన్‌.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడం, రిమాండ్‌కు పంపడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ వేసిన పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు రిజర్వ్ చేసింది. తాత్కాలిక బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి