Home » Delhi Excise Policy
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో పదేపదే విచారణకు గైర్హాజర్ అవుతున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై రౌస్ అవెన్యూ కోర్టును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆశ్రయించింది. పీఎంఎల్-2002 సెక్షన్ 50 కింద సీఎంపై కోర్టులో ఫిర్యాదు చేసింది. తాము పంపిన సమన్లను ఖాతరు చేయడం లేదని కోర్టు దృష్టికి తెచ్చింది.
లిక్కర్ స్కామ్‌లో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. జనవరి 31వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.
సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు కష్టాలు తప్పేలా లేవు. ఫిబ్రవరి 2న తమ విచారణ మందు హాజరు కావాల్సిందిగా కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారంనాడు మరోమారు సమన్లు పంపింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న 'ఆప్' నేత సంజయ్ సింగ్‌కు ఊరట లభించింది. ఢిల్లీ నుంచి రాజ్యసభకు జరుగనున్న ఎన్నికల్లో 'ఆప్' అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేసేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతించింది. ఆయనను రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తీసుకు వెళ్లాలని జైల్ సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది.
అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం ఈడీ అరెస్ట్ చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. గురువారం ఉదయం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై ఈడీ దాడులు చేస్తుందని, ఆ తర్వాత అరెస్ట్ అవకాశాలున్నాయని బుధవారం అర్ధరాత్రి చేసిన ట్వీట్‌లో వారు పేర్కొన్నారు.
కేసుల విచారణకు హాజరుకావాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్(CM Kejriwal) కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్(CM Hemanth Sorean)కు ఈడీ జారీ చేసిన సమన్లను పాటించడానికి ఇరువురు నిరాకరించారు. మనీలాండరింగ్ కేసులో సోరెన్ ను విచారణకు పిలవగా.. ఆయన వెళ్లకపోవడంతో ఈడీ ఆయన సన్నిహితుల నివాసాలపై దాడులు చేస్తోంది.
లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారంనాడు మూడోసారి సమన్లు పంపింది. 2024 జనవరి 3న తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆ సమన్లలో కోరింది. ఇప్పటికే ఈడీ ఆయనకు రెండుసార్లు సమన్లు పంపినప్పటికీ ఆయన విచారణకు హాజరుకాలేదు.
దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనకు పంపిన నోటీసులపై ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమైనవని, రాజకీయంగా ప్రేరేపించినవని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.
సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారంనాడు సమన్లు పంపింది. లిక్కర్ కేసులో ప్రశ్నించేందుకు ఈనెల 21వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఈ సమన్లలో కోరింది.
ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని డిసెంబర్ 11వ తేదీ వరకూ రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారంనాడు పొడిగించింది. నిందితులపై పలు డాక్యుమెంట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫైల్ చేయాల్సి ఉందని కోర్టు అభిప్రాయపడింది.