Home » Danam Nagender
Danam Nagender: ఆపరేషన్ రోప్‌లో భాగంగా చింతల్‌బస్తీ ఏరియాలో అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు గుర్తించారు. అందులో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కలిసి అక్కడి రోడ్డును క్లియర్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా దానం నాగేందర్ చేరుకున్నారు. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారులకు తనదైన శైలిలో సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు.
ఫార్ములా-ఈ కార్ రేస్ విషయంలో తాను కేటీఆర్‌కు క్లీన్ చిట్ ఇవ్వలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. తన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా ప్రచారం చేస్తున్నాయని చెప్పారు.
హైడ్రా వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అయిందని మళ్లీ చెప్తున్నాను.. మూసిపై కంటి తుడుపు చర్యల్లాగా ఒక్కరోజు మూసి నిద్ర చేశారని.. వారు నిద్ర చేయడానికి వెళ్లే ముందే ఏపీలు పెట్టించుకుని పడుకున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు.ఈ కార్ రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందనే తాను చెబుతున్నానని, అలా అని అవినీతి కాలేదని తాను చెప్పలేదన్నారు.
‘ఫార్ములా ఈ రేస్’తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందనడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఈ రేస్ నిర్వహణతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించగలిగాం. ఇందులో అవినీతి ఉందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేం.
గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక డివిజన్లను కైవసం చేసుకుని సత్తా చాటాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender) పిలుపునిచ్చారు.
నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని, ఒకవైపు అభివృద్ధి పనులు, మరోవైపు సుందరీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender) అన్నారు.
కనీవిని ఎరుగని రీతిలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender) అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలుచేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు.
మైనస్ 5 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య మంచు కురుస్తుండగా కాశ్మీర్ అందాలను స్వయంగా చూస్తున్నట్లు అనుభూతి పొందేలా ఏర్పాటైన వింటర్ ఉత్సవ్ మేళా సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
పేదల ఇళ్ల జోలికి వెళ్లడం తొందరపాటు నిర్ణయమే అవుతుందని, బాధితుల్లో భరోసా కల్పించేందుకు నిజనిర్ధారణ కమిటీ వేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరనున్నట్టు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు.
కూలగొట్టే ముందు హైడ్రా అక్కడి వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియజేస్తే ఇంత ఇబ్బంది అయ్యేది కాదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చిన్న చిన్న ఘటనలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నాయన్నారు. ఒక చిన్నారి తన పుస్తకాలు ఇంట్లో ఉన్నాయని బోరున ఎడ్చిందని...