Home » Damodara Rajanarasimha
అత్యవసర పరిస్థితుల్లో రోగిని తరలించడానికి వీలుగా కొత్తగా నిర్మించనున్న ఉస్మానియా ఆస్పత్రి ఆవరణలో హెలీప్యాడ్ రానుంది. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఆస్పత్రికి చేరుకునేందుకు స్కైవాక్ కూడా ఏర్పాటు కానుంది.
అంతర్జాతీయ ప్రమాణాలతో ఉస్మానియా ఆస్పత్రి భవనాలను నిర్మించనున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
నగరంలో కొత్తగా నిర్మించబోతున్న ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital) ద్వారా అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha) తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా పది రోజులుగా నిలిచిపోయిన రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు సోమవారం రాత్రి పునఃప్రారంభమయ్యాయి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులతో సర్కారు జరిపిన చర్చలు సఫలం కావడంతో.. సేవలను యథావిధిగా కొనసాగించనున్నట్లు ఆస్పత్రులు ప్రకటించాయి.
మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిని కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా అభివృద్ధి చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
తరచూ ఔషధాల కొరత ఉన్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ అంశంపై నిరంతర పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాలోనూ ముగ్గురు సభ్యులతో కమిటీ వేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల(ఎ్‌సహెచ్‌జీ) ఆధ్వర్యంలో మొట్టమొదటి మహిళా పెట్రోల్ బంకును సంగారెడ్డిలో ఏర్పాటు చేస్తుండటం ఆనందంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఔషధ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha) తెలిపారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ర్టేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన వార్షిక నివేదికను ఆ శాఖ డైరక్టర్ జనరల్ కమల్‌హాసన్‌రెడ్డి(Kamal Haasan Reddy)తో కలిసి ఆవిష్కరించారు.
ఆశాలకు ప్రతి నెలా రూ. 18 వేల స్థిర వేతనం చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు నివ్వాలని ప్రభుత్వానికి ఆశా వర్కర్స్ యూనియన్ విజ్ఞప్తి చేసింది.
సర్కారీ ఆసుపత్రుల్లో మరమ్మతులపై వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ప్రాంతీయ ఆస్పత్రి వరకు, జిల్లా ఆస్పత్రి నుంచి బోధనాస్పత్రి వరకు రిపేర్లకు అయ్యే ఖర్చుల లెక్కలు తీయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.