Home » Cyber attack
సైబర్ నేరగాళ్లు కొత్తపంథా ప్రారంభించారు. ఖాతాదారులను మభ్యపెట్టి బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, ఇతర వివరాలు తెలుసుకోవడం కష్టంగా మారుతుండడంతో వేరే మార్గంలో దోచేందుకు యత్నాలు మొదలుపెట్టారు. నిత్య జీవితంలో అత్యంత కీలకంగా మారిన ఫోన్‌ను హ్యాక్ చేస్తున్నారు.
సర్పవరం జంక్షన్, నవంబరు 22 ( ఆంధ్ర జ్యోతి): సైబర్ నేరాలపై ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటర్నేట్ ఆధారంగా జరిగే మోసాలను అవగాహనతో నియంత్రించవచ్చని కాకినాడ ఎస్‌డీపీవో రఘవీర్ విష్ణు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ రూరల్ తిమ్మాపురం అక్నూ
సైబర్ ఉచ్చులో పడి తిరుపతికి చెందిన ఓ ఎరువుల వ్యాపారి రూ.13.5 లక్షలు పోగొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి రూరల్ సీఐ చిన్నగోవిందు తెలిపిన ప్రకారం.. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటకు చెందిన ఎరువుల వ్యాపారి (మార్కెటింగ్) జయరామిరెడ్డికి తిరుపతిలో ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతా ఉంది.
సైబర్ నేరగాళ్లను బురిడీ కొట్టించాడో ఉద్యోగి. కొరియర్ ట్రాకింగ్ కోసం కాల్ చేయడంతో.. సైబర్ నేరగాళ్లు లైన్‌లోకి వచ్చారు. ఓటీపీ చెప్పాలని కోరారు. అనుమానం వచ్చి బ్యాంక్‌కు వెళ్లి క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేయాలని కోరారు.
సరికొత్త సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. కొరియర్ బాయ్ అనుచిత ప్రవర్తనపై కస్టమర్ ఫిర్యాదు చేస్తే.. నమోదు చేయాలంటే రూ. 10 చెల్లించాలని నమ్మించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) అతడి ఖాతా నుంచి రూ. 4.68 లక్షలు కాజేశారు. సైబర్ క్రైమ్ డీసీపీ కవిత(సైబర్ క్రైమ్ డీసీపీ కవిత) తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 67 ఏళ్ల వృద్ధుడికి ఫ్లిప్‌కార్ట్ పార్శిల్ వచ్చింది. కొరియర్ బాయ్ కస్టమర్‌ను పేరు పెట్టి గట్టిగా పిలిచాడు.
డీహెచ్‌ఎల్ కొరియర్ సర్వీసు పేరుతో ముంబై నుంచి చైనాకు వెళ్తున్న పార్శిల్‌లో చట్టవ్యతిరేక వస్తువులు దొరికాయంటూ నగరానికి చెందిన యువకుడిని సైబర్ కేటుగాళ్లు(Cyber criminals) బెదిరించి రూ. 6.90 లక్షలు కాజేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 28 ఏళ్ల యువకుడికి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేశారు.
సైబర్ నేరగాళ్లు(Cyber criminals) కాజేసిన డబ్బును రికవరీ చేసిన సైబర్‌క్రైం పోలీసులు బాధితుడి ఖాతాలో జమ చేయించారు. బ్యాంకు అధికారులమంటూ నగరానికి చెందిన వ్యక్తికి ఫోన్‌చేసిన సైబర్ నేరగాళ్లు.. క్రెడిట్ కార్డు లిమిట్(Credit card limit) పెంచుతామని చెప్పారు.
ఆన్‌లైన్ పార్ట్‌టైం జాబ్ పేరుతో సైబర్ నేరగాళ్లు(Cyber criminals) రూ.1.45 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి(25) ఆన్‌లైన్ పార్ట్‌టైం జాబ్(Online part-time job) ప్రకటన చూసి వారిని సంప్రదించాడు. చిన్నపాటి టాస్క్‌లు చేస్తే డబ్బులు చెల్లిస్తామని చెప్పిన నేరగాళ్లు టెలిగ్రాం గ్రూపులో చేర్చారు.
పోలీసుల దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు సైబర్ నేరగాళ్లు(Cyber criminals) కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. మోసం చేసి కాజేసిన డబ్బును అమాయకుల ఖాతాలకు మళ్లిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా బ్యాంక్ లావాదేవీలు జరిగిన ఖాతాలను పోలీసు అధికారులు ఫ్రీజ్ చేస్తున్నారు.
డిజిటల్ అరెస్టులు, డీప్ ఫేక్‌లు, ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్, హనీ ట్రాప్ వంటి ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకి అధికమవుతున్న వేళ యూజీసీ అప్రమత్తమైంది.