Home » CSK
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(శుక్రవారం) చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది.
ఈ ఐపీఎల్ సీజన్లో మరో ఉత్కంఠపోరుకు నేడు తెరలేవనుంది. గత మ్యాచ్‌లో గెలుపుతో ఊపుమీదున్న పంజాబ్ కింగ్స్‌ను.. సొంతగడ్డపై చెన్నై ఢీకొనబోతోంది. మరి ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిది.? చూడదగ్గ ప్రధాన ఆటగాళ్ల మధ్య పోరు ఎలా ఉంటుందో ఓ లుక్కేద్దాం..
ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28న ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ‘రోర్ 2026’ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది.
మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 సమరం ప్రారంభం కానుంది. టీమిండియా స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ సంజు శాంసన్.. ట్రేడ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చేరిన సంగతి తెలిసిందే. అయితే అతడు సీఎస్కేకి వైస్ కెప్టెన్ అవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఐపీఎల్ 2026.. మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఫీల్డింగ్ కోచ్‌ను ప్రకటించింది. ఈ సీజన్‌లో సీఎస్కే ఫీల్డింగ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జేమ్స్ ఫోస్టర్‌ను నియమిస్తున్నట్లు తెలిపింది.
ఐపీఎల్‌లో టాప్ జట్లలో ఒకటైన సీఎస్కే డబ్ల్యూపీఎల్‌లోకి అడుగుపెట్టనున్నట్లు ఆ ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. అయితే ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడే అమల్లోకి రాదని, తమ భవిష్యత్తు కార్యాచరణలో భాగమని ఆయన వివరించారు.
నిన్న(మంగళవారం) ఐపీఎల్ మినీ వేలం జరిగింది. ఈ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భారత బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ చేరారు. దేశవాళీ క్రికెట్‌లో సర్ఫరాజ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో, ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై జట్టు అతడిని రూ. 75 లక్షల కనీస ధరకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఇన్ స్టాలో ఓ ఎమోషనల్ పెస్ట్ షేర్ చేశాడు.
శ్రీలంక స్టార్ పేసర్ మతీశా పతిరనను ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.18కోట్లు పెట్టి దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నైతో తనకున్న అనుభవాన్ని, ధోనీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పతిరన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
ఐపీఎల్ 2026 మినీ వేలం మంగళవారం అబుదాబీ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ సీఎస్కేకు కీలక సూచన చేశాడు. బ్రేస్‌వెల్‌ను వేలంలో దక్కించుకోవాలని సూచించాడు.
14 ఏళ్ల ఐపీఎల్ ప్రయాణానికి ఫాఫ్ డుప్లెసిస్ వీడ్కోలు ప్రకటించాడు. ఐపీఎల్ 2026 వేలానికి ముందు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. ఈ ఏడాది పీఎస్ఎల్‌లో ఆడనున్నట్టు తెలిపాడు.