Home » CPI
కాశ్మీర్లో శాంతి భద్రతలు రక్షించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చినప్పట్టికి మోదీ కానీ బీజేపీ తమ గత పాలనను ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని అన్నారు.
ప్రత్యేక హోదా అనేది రాజ్యాంగపరమైన నిబంధన అని, దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని సీసీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అలా చేయడం వల్ల ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని మార్చేందుకు వీలుండదన్నారు.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ (80) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. కోల్‌కతాలోని తన నివాసంలో కన్నుమూశారు. గతేడాది న్యుమోనియా సోకడంపాటు పలు అనారోగ్య సమస్యలు తలెత్తాయి..
Andhrapradesh: రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ అక్రమాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... మదనపల్లిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీ భూ అక్రమాలకు పాల్పడ్డారని.. ఆయన భార్య పేరు మీద వందల ఎకరాలు ఉన్నాయని ఆరోపించారు.
అమూల్ పాల రైతులకు న్యాయం చేయాలని సీపీఐ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున డిమాండ్ చేసారు. శనివారం పాల రైతులతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్ వినోద్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలు, ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి సింగరేణి సంస్థను కాపాడాలనే చిత్తశుద్ధి ఉంటే వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి(Amaravati) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన రూ.15వేల కోట్లను గ్రాంట్‌గా మార్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(Ramakrishna) డిమాండ్ చేశారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు ద్వారా రూ.15వేల కోట్లు ఇప్పించినట్లు కేంద్రం ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారని, ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకొనే శక్తి చంద్రబాబుకు ఉందని ఆయన తెలిపారు.
కేంద్ర ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరిగిన తెలంగాణకు మాత్రం తీవ్రమైన అన్యాయం చేశారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు.
విజయవాడ: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కామెంట్స్ చేశారు. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని పొగడడానికే పరిమితమయ్యారని, ప్రధాని మోదీ పదేళ్ల కృషి వలన దేశం ప్రగతి సాధించింది అని చెబుతున్నారని.. ఏ విషయంలో దేశం అభివృద్ధి చెందిందో చెప్పాలని డిమాండ్ చేశారు.