Home » CPI
ఆటో, క్యాబ్ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు.
తెలంగాణకు స్వతంత్రం ఎవరి వల్ల వచ్చిందో నాయకులు తెలుసుకోవాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గజ్వేల్ మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయిధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండమీద రాయుడు వెలసిన దేవరకొండకు చెందిన కోట్ల విలువ చేసే భూమిని వైసీపీ, టీడీపీ నేతలు కబ్జా చేసేందుకు యత్నిస్తు న్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నారా యణస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం సీపీఐ అధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
కమ్యూనిస్టు పార్టీ పేరు ఉచ్ఛరించడానికి, కమ్యూనిస్టు చరిత్రను చెప్పడానికి పాలక పార్టీలు భయపడతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని పేర్కొన్నారు.
Andhrapradesh: విశాఖ స్టిల్ ప్లాంట్ కూడా ప్రైవేటుపరం చేసే కుట్ర జరుగుతోంది అని సీపీఐ నేత రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టిల్కు ప్రత్యేకంగా బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ‘‘మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విశాఖ స్టీల్ను ప్రైవేటుపరం కాకుండా చూడండి’’ అంటూ డిమాండ్ చేశారు.
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఆంధ్రుల హక్కుగా భాసిల్లుతున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టి తెగ నమ్మినందుకు కుట్రలు పన్నుతున్నారని, ఇప్పటికే రెండు ప్లాంట్లను మూసివేసి మూడో ప్లాంట్ కూడా ఆపేందుకు చూస్తున్నారన్నారు.
పేద ప్రజల కోసం పోరాడిన వ్యక్తి సీతారాం ఏచూరి అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన చేసిన పోరాటాన్ని వాళ్లు శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారని చెప్పారు.
వామపక్ష యోధుడు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.
తెలంగాణ విలీన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.