Home » CPI Narayana
Telangana: కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ సీబీఐ విచారణ అడగడం ఒక పెద్ద జోక్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ ఒకటే వ్యవహార శైలిలో నడుస్తున్నాయని ప్రజలకు తెలుసన్నారు.
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్, మాజీ సీఎం కేసీఆర్‌పై సీపీఐ నేత నారాయణ విమర్శలు చేశారు. నరేంద్రమోదీ ప్రభుత్వం పార్లమెంట్ పునాదులను తవ్వే ప్రమాదముందని ఒకవైపు దేవుళ్ళను పూజిస్తూ.. మరోవైపు రైతులను హింసిస్తోందని ఆరోపించారు.
బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వాణీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుపట్టారు. జైల్లో ఉండాల్సిన ఆయనకు భారతరత్న ఇవ్వడమేంటని ప్రశ్నించారు. అయోధ్యలో రామమందిరం కోసం 1990లో అద్వాణీ చేపట్టిన రథయాత్ర దేశంలో మతకల్లోహాలు సృష్టించిందని విమర్శించారు.
సీఎం జగన్(CM JAGAN) మీద 12కేసులు ఉన్నా.. యథేచ్చగా బయట తిరుగుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(Narayana) అన్నారు. దేశంలోనే 420ముఖ్యమంత్రి జగన్ అన్నారు. జవాబుదారీ పార్లమెంట్‌ను పక్కన పెట్టి.. మోదీ ఇజమని చెబుతున్నారని మండిపడ్డారు.
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీపీఐ అగ్ర నేత నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ తానే ముఖ్యమంత్రి అనే భావనలో ఉన్నారు. ఆయన మాట తీరు అలా ఉందని సీపీఐ నారాయణ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నడుస్తోందని, రేవంత్ రెడ్డి సీఎం పదవీ చేపట్టారని కేటీఆర్‌కు గుర్తుచేశారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కక్కిన కూడును తినేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆశపడ్డాడని మండిపడ్డ ఆయన.. ‘ఇండియా’ కూటమిని బలహీన పర్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయని, రాజకీయాలకు సంబంధం లేకుండా ఒక మతాన్ని పెంపొందించారని, కాబినెట్‌లో కూడా మతాన్ని రాజకీయం చేశారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.
Andhrapradesh: అంగన్వాడీల సమ్మెపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని సీపీఐ నేత నారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎస్మా ప్రయోగిస్తే ఇందిరాగాంధీకి పట్టినగతే జగన్‌కు పడుతుందని హెచ్చరించారు.
బేగంపేటలోని ప్రకాశ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లో పేదల ఇళ్లు అన్యాయంగా కూల్చి కబ్జాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరులపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ(CPI National Secretary Dr. K. Narayana) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Telangana: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏపీ సీఎం జగన్ కలవడంపై సీపీఐ నేత నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. ఓట్ల కోసమే మాజీ సీఎం కేసీఆర్‌ను జగన్ కలిశారని విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఇంట్లో కుంపటి వ్యాఖ్యలు చేసి.. జగన్ తన ఓటమిని ఒప్పుకున్నారన్నారు. తన ఇంట్లో తానే జగన్ గొడవ సృష్టించుకుని ఇతరులను నిందిస్తున్నారన్నారు.