Home » Congress 6 Gurantees
Minister Ponnam Prabhakar: మెప్మా ద్వారా మహిళలకు సాయమందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గౌరవెల్లి, మిడ్ మానేరు, మల్లన్న సాగర్‌కు సంబంధించిన కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరుతానని చెప్పారు. తన మీద కేసులు ఉన్నాయి.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీద కూడా కేసులు ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి పూణే కోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. పరువు నష్టం కేసులో పూణే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాహుల్ గాంధీపై ఈ పరువు నష్టం కేసును విడి సావర్కర్ మనవడు దాఖలు చేశారు.
KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీల పేరిట ప్రజలను తప్పు దోవ పట్టించి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
BANDI SANJAY: విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రేవంత్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. 6 గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చే వరకు ఆందోళన చేస్తామని బండి సంజయ్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు.
Minister Ponguleti: ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పారదర్శకంగా ఉండేందుకు విజిలెన్స్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏమైనా అనుమానాలు ఉంటే వెబ్ సైట్‌లో నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లకు స్టీల్, సిమెంట్, ఇసుకపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
పేదలను, రైతులను సీఎం రేవంత్‌రెడ్డి రోడ్డున పడేశారని మాజీ మంత్రి హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో 41 శాతం క్రైం రెట్ పెరిగిందని గుర్తుచేశారు. ఇది రేవంత్ రెడ్డి సాధించిన ప్రగతి అని హరీష్‌రావు విమర్శించారు.
రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సవాల్ విపిరారు. రుణమాఫీ వందశాతం పూర్తి అయినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు.
రుణమాఫీపై సీఎం రేవంత్ ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. దేవుళ్ల సాక్షిగా హామీ ఇచ్చి మరిచారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాక తొలి ఏడాదిలోనే మార్పు మొదలైందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మాత్రమే కాకుండా 160 అంశాల్లో ప్రజోపయోగ పనులు చేపట్టినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
కాంగ్రెస్ పాలనపై ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. విజయోత్సవాల కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. హామీలు నెరవేర్చకుండా సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు.