• Home » Congress 6 Gurantees

Congress 6 Gurantees

  Lok Sabha Election 2024: లోక్‌సభ ఎన్నికల్లో మోదీ గాలి వీచింది..  బోయినపల్లి వినోద్  షాకింగ్ కామెంట్స్

Lok Sabha Election 2024: లోక్‌సభ ఎన్నికల్లో మోదీ గాలి వీచింది.. బోయినపల్లి వినోద్ షాకింగ్ కామెంట్స్

లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Election 2024) పోలింగ్ సరళిపై బీఆర్ఎస్ (BRS) కరీంనగర్ అభ్యర్థి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapalli Vinod Kumar) హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ గాలి వీచిందన్నారు. రియాలిటీనీ దాచాల్సిన అవసరం లేదని చెప్పారు.

Lok Sabha Election 2024: తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుస్తాం: కిషన్‌రెడ్డి

Lok Sabha Election 2024: తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుస్తాం: కిషన్‌రెడ్డి

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలను గెలుస్తున్నామని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలను గెలుస్తున్నామని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని గుర్తుచేశారు.

CM Revanth: ఆ అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం రాలేదు: సీఎం రేవంత్

CM Revanth: ఆ అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం రాలేదు: సీఎం రేవంత్

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న పలు సమస్యలపై బుధవారం తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈ సమీక్షలో పాల్గొన్నారు.

CM Revanth: రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth: రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బుధవారం తెలంగాణ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Lok Sabha Election 2024: కృష్ణా జలాల కోసం కేసీఆర్, జగన్ కుట్ర పన్నారు:  మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Lok Sabha Election 2024: కృష్ణా జలాల కోసం కేసీఆర్, జగన్ కుట్ర పన్నారు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కృష్ణా జలాల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కుట్ర పన్నారని.. అందుకే తన దోస్తు కోసం ఆంధ్ర ప్రాంతానికి ఆ నీటిని వదిలేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతంగా కట్టానని కేసీఆర్ (KCR) చెప్పుకుంటాడని.. కానీ ఆ ప్రాజెక్ట్ నిర్మాణ లోపం కారణంగానే గోదావరి నీళ్లు సముద్రంలో కలవడం లేదా అని ప్రశ్నించారు.

Lok Sabha Election 2024: నన్ను గెలిపిస్తే.. ఆ హామీలు నెరవేరుస్తా: కడియం కావ్య

Lok Sabha Election 2024: నన్ను గెలిపిస్తే.. ఆ హామీలు నెరవేరుస్తా: కడియం కావ్య

పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఇంకా 4 రోజుల సమయమే ఉండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. పలు హామీలు ఇస్తూ ప్రజలను ఆకర్షించడానికి అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంట్ స్థానాల పరిధుల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెబుతూ విసృత్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్ (Congress) అభ్యర్థి కడియం కావ్య (Kadiyam Kavya) గురువారం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.

Lok Sabha Election 2024: అందుకే బీజేపీ రాముడిని వాడుకుంటుంది: రేవంత్‌రెడ్డి

Lok Sabha Election 2024: అందుకే బీజేపీ రాముడిని వాడుకుంటుంది: రేవంత్‌రెడ్డి

బీజేపీ (BJP) పదేళ్లు దేశంలో అధికారంలో ఉండి తెలంగాణకు ఏం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించని బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు ఓట్లు వేయాలని నిలదీశారు. నర్సాపూర్‌లో గురువారం కాంగ్రెస్‌ జనజాతర సభ జరిగింది. ఈ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. దుబ్బాక ప్రజలకు బీజేపీ అభ్యర్థి (రఘునందన్‌రావు) ఏం చేయలేదని మండిపడ్డారు.

Lok Sabha Election 2024:రేవంత్ నా సవాల్‪ను స్వీకరించకుండానే డైలాగ్‪లు కొడుతున్నారు: హరీశ్‌రావు

Lok Sabha Election 2024:రేవంత్ నా సవాల్‪ను స్వీకరించకుండానే డైలాగ్‪లు కొడుతున్నారు: హరీశ్‌రావు

తెలంగాణలో 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయలేక అట్టర్ ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. కేవలం ఐదు నెలల కాలంలోనే రేవంత్ ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత తెచ్చుకుందని అన్నారు. బీజేపీ తెలంగాణకు మొండిచేయి చూపించిందని ఆరోపణలు చేశారు. ఆ పార్టీ కార్మికులకు వ్యతిరేకంగా, కార్పొరేట్లకు అనుకూలంగా పని చేస్తుందని విమర్శించారు.

KTR: ఇన్వర్టర్లు, కొవ్వొత్తులు సిద్ధం చేసుకోండి..రాష్ట్ర ఓటర్లకు కేటీఆర్ సూచన

KTR: ఇన్వర్టర్లు, కొవ్వొత్తులు సిద్ధం చేసుకోండి..రాష్ట్ర ఓటర్లకు కేటీఆర్ సూచన

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో(lok sabha elections 2024) భాగంగా నాలుగో దశలో మే 13న తెలంగాణ, ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రస్తుత అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

Lok Sabha Election 2024: దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది.. మోదీపై కేసీఆర్ విసుర్లు

Lok Sabha Election 2024: దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది.. మోదీపై కేసీఆర్ విసుర్లు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ వల్ల దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఆరోపించారు.కామారెడ్డిలో కార్నర్ మీటింగ్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి