Home » Congress 6 Gurantees
రెండు రోజులుగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ (Congress) కిసాన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి (Anvesh Reddy) అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మాజీ సీఎం కేసీఆర్ మొదట సన్నాలు వేయమన్నారని.. ఆ తర్వాత వరి వేస్తే ఉరే అనలేదా అని సూటిగా ప్రశ్నించారు.
కాంగ్రెస్ (Congress) అభయ హస్తం అక్కరకు రాని నేస్తంగా మారిందని బీఆర్ఎస్ సీనియర్ఖ నేత రావుల శ్రీధర్ రెడ్డి (Ravula Sridhar Reddy) ఆరోపించారు.వడ్లకు బోనస్‌పై కాంగ్రెస్ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.
అన్ని రకాల వడ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు. రైతులకు వడ్ల బోనస్ విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.
బీఆర్ఎస్ అనుబంధ పేపర్లో కావాలని తమ ప్రభుత్వం మీద బట్ట కాల్చి మీద వేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) మండిపడ్డారు. రాష్ట్రంలోని 19 మద్యం డిపోల్లో అన్ని రకాల బ్రాండ్ల నిల్వలు ఉన్నాయని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేయడం చూసి బీఆర్ఎస్ ఏడుపు గొట్టు రాజకీయాలు చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం ఎస్.ఆర్.కన్వెన్షన్‌లో నియోజక వర్గ సమావేశం నిర్వహించారు.
పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీపడేలా విధానాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు సూచించారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కు సంబంధించి మంగళవారం అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ అయిన ఇచ్చాడా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) ప్రశ్నించారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బ్లాక్ మెయిలర్ తీన్నార్ మల్లన్న కావాలో.. బీఆర్ఎస్ గోల్డ్ మెడల్ ఏనుగుల రాకేష్ రెడ్డి కావాలో ఆలోచించుకోవాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి (Rakesh Reddy) అన్నారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రభుత్వ ఉద్యోగాలపై రేవంత్ ప్రభుత్వ మెడలు వంచుతానని చెప్పారు.
: పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రతి పేదవాడి కళ ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో నెరవేరుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు.
తెలంగాణలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు.శనివారం వరంగల్లో పర్యటించారు. కేజీ టూ పీజీ యాజమాన్యాల ఆత్మీయ సమ్మేళనంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు.