Home » Collages
ఏడాది కాలంలో దేశంలో కొత్తగా 29 మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. వీటిలో అదనంగా 3,272 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15 నుంచి అన్ని పాఠశాలల్లోని విద్యార్థులు.. టీచర్లకు తోటి స్నేహితులకు గుడ్ మార్నింగ్‌కు బదులుగా జైహింద్ చెప్పాలని హరియాణా ప్రభుత్వం నిర్ణయించింది.
జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) నుంచి అనుమతులు రాని నాలుగు కొత్త వైద్య కళాశాలలపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది.
ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారు. ఈ మధ్యనే వికారాబాద్ అనంతగిరిపల్లి సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో పలువురు విద్యార్థులు పచ్చ కామెర్లకు గురవ్వగా, తాజాగా ఇదే పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు కామెర్లతో ఆస్పత్రిలో చేరారు.
ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రం నుంచి నీట్ రాసిన విద్యార్థుల ర్యాంకులను ప్రకటించింది. తెలంగాణ నుంచి ఈ దఫా 49,184 మంది క్వాలిఫై అయునట్లు గుర్తించింది.
రాష్ట్రంలో నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా పలు పీజీ కోర్సుల ప్రారంభానికి జాతీయ వైద్య మండలి అనుమతులు మంజూరు చేసింది. ఈమేరకు శుక్రవారం లెటర్ ఆఫ్ పర్మిషన్‌ను ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు పంపింది.
రాష్ట్రంలో వైద్య విద్య మరింత మందికి చేరువ కానుంది. తెలంగాణలో నాలుగు కొత్త వైద్య కళాశాలలకు జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) అనుమతులిచ్చింది. ఇందుకు సంబంధించి ఎల్‌వోపీ(లెటర్ ఆఫ్ పర్మిషన్)ను బుధవారం రాత్రి జారీ చేసింది.
ఇంజనీరింగ్ ప్రవేశాల్లో ఈసారీ కంప్యూటర్స్ అనుబంధ కోర్సుల్లో హవా కొనసాగింది. కంప్యూటర్ సైన్స్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐటీ.. విభాగాల్లో సీట్లు దాదాపు పూర్తయ్యాయి.
రాష్ట్రంలో వైద్య విద్య కళాశాలలకు ప్రిన్సిపాళ్లు, అనుబంధ ఆస్పత్రులకు సూపరింటెండెంట్లు దొరకడం కష్టమవుతోంది. విభాగాధిపతి(అడ్మినిస్ట్రేటివ్) పోస్టులైన వీటి కి.. వయో పరిమితి పెంపు బిల్లును గత ఏడాది ఏప్రిల్‌లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పటి గవర్నర్ డాక్టర్ తమిళిసైకు పంపగా ఆమె తిరస్కరించారు.
రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశలో సీట్లు పొందిన వారిలో ఎక్కువ మంది కాలేజీల్లో చేరలేదు. దీంతో 22,753 సీట్లు మిగిలిపోయాయి.