Home » CM Siddaramaiah
మైసూరు నగరాభివృద్ది సంస్థ ముడా ఆధ్వానంగా మారిందని దారిలోకి తీసుకువస్తానని సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) వెల్లడించారు. శుక్రవారం మైసూరులోని నివాసం వద్ద ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇదే సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ముడా’ అవినీతిపై ఇద్దరు ఐఏఎస్(IAS) అధికారులు దర్యాప్తు చేస్తున్నారన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లోక్‌సభ ఎన్నికల్లో తక్కువసీట్లు సాధించడంపై అధిష్ఠానం నిజనిర్ధారణ కమిటీని పంపింది. పార్టీ సీనియర్ నేత మధుసూధన్ మిస్త్రీ నేతృత్వంలోని కమిటీ బెంగళూరుకు వచ్చారు.
సిద్ధరామయ్యను పక్కకుపెట్టి డీకే శివకుమార్‌కు పగ్గాలు అప్పగిస్తారని హైకమాండ్ సైతం ఈ దిశగా కసరత్తు సాగిస్తున్నదని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అంతా సమైక్యంగా ఉన్నామనేలా కనిపించిన కాంగ్రెస్ నాయకుల మధ్య ఇటీవల విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. ఎవరికివారుగా చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వంలో కీలక సారథుల మధ్య ఎత్తులు పైఎత్తులు సాగుతున్నాయి. ఏడాది పాలన ముగియడం, లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో మళ్లీ ముసుగు రాజకీయాలు తీవ్రమవుతున్నాయి.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులు తనకు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా కేరళలోని ఓ దేవాలయంలో అఘోరాలు, తాంత్రికుల ద్వారా చేతబడి చేయిస్తున్నారని చెప్పడం రాష్ట్రంలో సంచలనంగా మారింది.
సీఎం పదవి కోసం డీకే శివకుమార్(DK Shivakumar) ఆత్రుత పడరాదని బీజేపీ నేత, తుమకూరు లోక్‌సభ అభ్యర్థి సోమణ్ణ(Somanna) సూచించారు. శనివారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.
"మా పార్టీకి ఓటేయకపోతే మీ కరెంట్ కట్ చేస్తాం" ఇదీ ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే(Congress MLA) ఓటర్లను బెదిరించిన తీరు. తీవ్ర వివాదాస్పదమైన ఆయన వ్యాఖ్యలు కర్ణాటక(Karnataka)లో రాజకీయ వేడిని రాజేశాయి.
దేశానికి ప్రధానమంత్రిని చేస్తామని హామీ ఇచ్చినా బీజేపీవైపు వెళ్లేది లేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) స్పష్టం చేశారు.
మైసూరు జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) బిళిగెరెలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. వరుణ(Varuna) తన అదృష్ట నియోజకవర్గమని, తాను రెండుసార్లు సీఎం కావడానికి ప్రజల ఆశీస్సులే కారణమని అన్నారు.