Home » CM Jagan
పదేళ్లుగా ప్రధానిగా ఉన్న మోదీ ఏపీకి ఏం చేశారో చెప్పాలని సీపీఐ (CPI) జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా (D.Raja) ప్రశ్నించారు. జింఖానా గ్రౌండ్ లో ఇండియా కూటమి ఆధ్వర్యం శుక్రవారం భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో రాజా ప్రసంగించారు. దేశంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తి అయ్యిందని తెలిపారు.
తెలుగుదేశం కంచుకోట గన్నవరంలో వైసీపీ సైకోల ఆటలు ఇక సాగవని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ (వైసీపీ) తిరిగితే ప్రజల మెడకు ఉరేనని అన్నారు. రేపు సాయంత్రం 4గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా రోడ్ల పైకి వచ్చి జగన్ ఫొటో ఉన్న పాస్ పుస్తకాల నకళ్లను తగలబెట్టాలని పిలుపునిచ్చారు.
Andhrapradesh: సమాజంలో అందరూ రూల్ ఆఫ్ లా పాటించాలని సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నేరాలు పెరిగాయని లెక్కలు చెబుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీ మార్చిందని... మద్యం డిస్టలరీస్‌ను ప్రభుత్వమే నిర్వహిస్తుందన్నారు. దీంతో పిచ్చి పిచ్చి బ్రాండ్‌లు తయారు చేస్తున్నారని..
రాష్ట్రాన్ని అపహస్యం చేసి.. గంజాయి మయంగా చేశారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు( Nara Chandrababu Naidu) ఆరోపించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం దోపిడీ, అరాచకాలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. మీరు వేసే ఓటు మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటవుతుందని ఉద్ఘాటించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం అధికారం టీడీపీ అధినేత చంద్రబాబుదేనని మాజీ రాజ్యసభ సభ్యుడు, రాయలసీమ హక్కుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు టీజీ వెంకటేష్(TG Venkatesh) స్పష్టం చేశారు.
Andhrapradesh: ఈసీ నిర్ణయాన్ని అపహస్యం చేసే విధంగా జగన్ సర్కార్ వ్యవహరిస్తోందని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల నిధుల విడుదలపై ఈసీ నిన్న (గురువారం) స్పష్టంగా ఆర్డర్ ఇచ్చిందని.. జగన్ ఆరు స్కీమ్స్‌కు బటన్ నొక్కితే డబ్బులు పడలేదన్నారు. లబ్ధిదారులకు డబ్బులు లేవని.. సాక్షికి మాత్రం ప్రకటనలు ఇస్తారని మండిపడ్డారు.
ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు సేవలు పార్టీకి అవసరమని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఉండి సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఆయన సేవలు పార్టీ ఏ విధంగా ఉపయోగించుకుంటుందో మీరు చూస్తారన్నారు. మూడు పార్టీలు ఇక్కడ.. అజెండా మాత్రం ఒక్కటేనన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించేది ఒక సైకో అని.. ఒక విధ్వంసకారుడని పేర్కొన్నారు.
ప్రజలకు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. జగన్ పాలనలో పేదలు తృప్తిగా ఉన్నారని ముద్రగడ పేర్కొన్నారు. ప్రతీ ఇంటిలో ప్యాన్లు ఉంటాయని.. గతంలో గాజు గ్లాసు పగిలి పోయిందన్నారు. ఆ ముక్కలు అందరికి ప్రాణహానిని కలిగిస్తాయని, గాజు గ్లాసుకి బదులు స్టీలు గ్లాసులు వాడుతున్నారన్నారు. టీడీపీ సైకిల్ తుప్పు పట్టడం వల్ల ఎవ్వరూ సైకిల్ వాడడం లేదన్నారు.
Andhrapradesh: ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించి జగన్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని రాష్ట్ర సర్కార్‌కు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అక్రమ ఇసుక తవ్వకాలను తక్షణం నిలిపివేయడానికి వెంటనే అధికారుల బృందాలను క్షేత్రస్థాయికి పంపాలని ఉన్నతన్యాయస్థానం ఆర్డర్స్ పాస్ చేసింది.
Andhrapradesh: దేశంలో ముస్లిం సోదరులకు ఎవరూ చేయని మంచి పనులు తాను చేశానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ముస్లిం పెద్దలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత మాట్లాడుతూ... రాష్ట్రం నలుమూలల నుంచి ముస్లిం సోదరులు సమావేశానికి వచ్చినందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు.