Home » Chief Minister
రెహ్మాన్ ఆదివారం ఉదయం గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్ సహా పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. తొలుత యాంజియాగ్రామ్ చేయాల్సి ఉంటుందనే ఆందోళన వ్యక్తమైంది.
మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన ఎన్‌ఈపీ అనేది జాతీయ విద్యావిధానం కాదని, దేశవ్యాప్తంగా హిందీని వ్యాప్తి చేసేందుకు ఉద్దేశించిన 'కాషాయ పార్టీ విధానం' అని చెన్నైలో బుధవారంనాడు జరిగిన పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ 'అహంకార చక్రవర్తి' అని, తమిళనాడు ప్రజలంటే ఏమాత్రం గౌరవం లేదని, ఆయన ముందుగా క్రమశిక్షణ నేర్చుకోవాలని ఎంకే స్టాలిన్ సూచించారు. నోటిని అదుపులో పెట్టుకోవాలన్నారు.
చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో సీఎం శనివారంనాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ, మహిళా సాధికారతా శాఖ తరఫున పింక్ ఆటోలను లబ్ధిదారులకు అందించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంద్భంగా శనివారంనాడిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందని చెప్పారు.
మహాయుతి ప్రభుత్వంలో బీజేపీ, శివసేన, ఎన్‌సీపీలు సమన్వయంతో పనిచేస్తుంటాయని, విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూటమి నేతలు సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటారని ఫడ్నవిస్ తెలిపారు. ప్రాజెక్టులను ఆపేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సపోర్ట్‌తో ముఖ్యమంత్రి స్థాయికి నితీష్ కుమార్ ఎదిగారని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజన్‌కు అనుగుణంగా కేంద్రంలో నితీష్ పొత్తు సాగిస్తున్నారని సమ్రాట్ చౌదరి చెప్పారు.
జనాభా ఆధారంగా డీలిమిటేషన్ వల్ల భారతదేశ సమాఖ్య వ్యవస్థకు, తమిళనాడు, ఇతర దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి తీవ్ర ముప్పు కలుగుతుందని, ఈ చర్యను అఖిల పక్ష సమావేశం ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తోందని ఆ తీర్మానం పేర్కొంది.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మంత్రి రాజీనామా వ్యవహారాన్ని సభ మందుకు తీసుకురావాల్సి ఉండగా సీఎం అందుకు భిన్నంగా వ్యవహరించారని కాంగ్రెస్ ఆరోపించింది. రాజీనామాపై సీఎం తన నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందు సభ దృష్టికి తీసుకురావాల్సి ఉంటుందని తెలిపింది.
మహిళా సమ్మాన్ యోజనతో సహా బీజేపీ ఇచ్చిన హామీలన్నింటినీ బడ్జెట్‌లో చేర్చనున్నట్టు సీఎం తెలిపారు. మార్చి 5న దీనిపై చర్చించేందుకు మహిళా సంస్థలన్నింటినీ విధాన సభకు ఆహ్వానిస్తున్నామనీ, బడ్జెట్‌పై వారంతా తగిన సూచనలు, సలహాలు ఇవ్వవచ్చని చెప్పారు.