Home » Chief Minister
నీట్‌పై రాష్ట్ర ప్రభుత్వం చిరకాలంగా సాగిస్తున్న పోరాటం కొనసాగుతుందని ఎంకే స్టాలిన్ చెప్పారు. తదుపరి కార్యాచరణపై సమగ్రంగా చర్చించేందుకు ఏప్రిల్ 9న అఖిలపక్ష సమావేశానికి ఆయన పిలుపునిచ్చారు.
ప్రస్తుతం ఉన్న వక్ఫ్ చట్టంలోని నిబంధనలు కాలపరీక్షకు నిలిచాయని, వక్ఫ్ ఆస్తులకు రక్షణ కల్పించాయని స్టాలిన్ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే వక్ఫ్ చట్టంలో కొత్తగా తీసుసువస్తున్న సవరణలు వక్ఫ్ నిర్వహణ, ఆస్తుల పరిరక్షణకు సంబంధించి బోర్డులకున్న అధికారాలు, బాధ్యతలను బలహీనపరచేలా ఉన్నాయన్నారు.
మోదీ సెప్టెంబర్‌లో రిటైర్‌మెంట్ కావాలనే ఆలోచనతో నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి మోహన్ భగవత్‌ను కలిసారని శివసేన (యూబీటీ)నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలను ఫడ్నవిస్ కొట్టివేశారు.
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో రవాణా మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,000 కోట్లు కేటాయించారు. సంక్షేమ పథకాల్లో భాగంగా అర్హత కలిగిన మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం అందించేందుకు రూ.5,100 కోట్లు కేటాయించారు.
నిజమైన శివసేన నేత ఎవరో 2024లో ప్రజలే నిర్ణయించారని, దోశద్రోహి ఎవరో, ఆత్మగౌరవం కలవారెవరో ప్రజలు నిర్ణయించిన విషయాన్ని కమ్రా తెలుసుకోవాలని ఫడ్నవిస్ అన్నారు. బాలాసాహెబ్ థాకరే వారసత్వాన్ని షిండే ముందుకు తీసుకువెళ్లారని గుర్తు చేశారు.
చెన్నైలో జరిగిన జేఏసీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత కేటీఆర్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమమార్ తదితరులు పాల్గొన్నారు.
'వికసిత్ ఢిల్లీ బడ్జెట్' రూపకల్పన కోసం నిపుణులతో సహా వివిధ వర్గాలను తమ ప్రభుత్వం సంప్రదించిందని, ప్రజల నుంచి ఇ-మెయిల్ ద్వారా 3,300 సూచనలు, వాట్సాప్ ద్వారా 6,982 సూచనలు వచ్చాయని సీఎం రేఖాగుప్తా తెలిపారు.
హింసకు కారణమైన వారి నుంచి ఆస్తి నష్టం మొత్తాన్ని వసూలు చేస్తామని, వారు డబ్బులు చెల్లించని పక్షంలో వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని విక్రయిస్తామని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు.
కొత్త వేతనాల ప్రకారం ముఖ్యమంత్రి వేతనం రూ.75,000 నుంచి 1.5 లక్షలకు చేరింది. మంత్రుల వేతనం 108 శాతం పెరిగి రూ.60,000 నుంచి రూ.1.25 లక్షలకు చేరింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనం రూ.40,000 నుంచి రూ.80,000కు చేరింది.
జనాభా ప్రాతిపదికన పునర్విభజనను తమిళనాడు ప్రభుత్వం తొలుత వ్యతిరేకించిందని, రాష్ట్రంలోని 58 పార్టీలు అన్ని విభేదాలను పక్కనపెట్టి ఒక్కటయ్యాయని ఎంకే స్టాలిన్ చెప్పారు.