Home » Chief Minister
'ఆప్' జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు సివిల్ లైన్స్‌లోని 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ బంగ్లాను అధికారిక నివాసంగా చేసుకుని ఉండేవారు. దీనిని ''శీష్ మహల్" (అద్దాలమేడ)గా అభివర్ణిస్తూ బీజేపీ ఎన్నికల అస్త్రంగా చేసుకుంది.
కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ కేంద్ర నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సీఎం రేసులో ముగ్గురు నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తు్న్నాయి. ఈ ముగ్గురిలో పర్వేష్ వర్మ ముందున్నారు.
గత ఏడాది ఏప్రిల్‌లో అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఉన్న అతిషి బీజేపీపై ఆరోపణలు చేశారు. తనను, ఇతర ఆప్ నేతలను బీజేపీకి చెందిన కొందరు సంప్రదించినట్టు తెలిపారు. తమ పార్టీలోకి చేరాలని, లేదంటే నెలలోగా ఈడీ అరెస్టును ఎదుర్కోవలసి వస్తుందని వారు చెప్పినట్టు అతిషి ఆరోపించారు.
అధికారిక సమాచారం ప్రకారం, 1 నగర నిగమ్, 6 నగర్ పాలిక, 5 నగర్ పరిషత్, రూరల్ పంచాయతీల్లో మద్యంపై నిషేధం విధించారు. వీటిలో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, బాందక్పూర్, మైహర్, సల్కాన్‌పూర్, లింగ, దితియా, మండలేశ్వర్, మహేశ్వర్, మాండసౌర్, అమర్‌కంటక్, మాండ్లా (నర్మదా ఘాట్), ముల్తాయ్, కుండల్‌పూర్, చిత్రకూట్, బర్మన్, పన్నా ఉన్నాయి.
కేజ్రీవాల్‌ను ఎలాగైనా మట్టుబెట్టాలన్నదే బీజేపీ ఏకైక లక్ష్యమని అతిషి ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల నుంచి ఎలాంటి హింసాకాండ, దాడులు జరగలేదని ఒప్పుకోవాలంటూ ఆప్ కార్యకర్తలపై పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక సీట్లులో గెలిపించిన తర్వాత దేవేంద్ర ఫడ్నవిస్ పేరు మారుమోగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడంతో పాటు మోదీ వారసత్వాన్ని కొనసాగించే అవవకాశం ఉన్న నేతల జాబితాలో ఫడ్నవిస్ పేరు కూడా వచ్చి చేరింది.
అతిషిపై బిధూడి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. అతిషి ఇంటిపేరు మార్చుకున్నారంటూ జనవరి 6న రోహిణిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అభ్యర్థిగా కల్కాజీ నియోజకవర్గం నుంచి అతిషి పోటీలో ఉన్నారు. ఎన్నికల ప్రచారానికి రూ.40 లక్షలు అవుతుందని అతిషి అంచనా వేశారు.
ఆర్ఎస్ఎస్‌పై శరద్ పవార్ పొగడ్తలకు దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ, పవార్ చాలా స్మార్ట్ అని, ఒక్కోసారి మన పోటీదారుల్ని కూడా ప్రశంసించాల్సి వస్తుందని అన్నారు.
న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త ఓట్లు చేర్చడం, పాత పేర్లు తొలగించడంపై అతిషి ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరారు.